రెండు కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసిన డిఎస్పీ

  0
  221

  రెండు కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఒక డిఎస్పీ ఎసిబికి చిక్కిపోయాడు. ఇంత పెద్దమొత్తంలో లంచం డిమాండ్ చేసిన డిఎస్పీ ఉదంతమే ఇప్పుడు దాదర్ లో సంచలమైంది. రాజేంద్రపాల్ అనే ఈ డీఎస్పీని , అతడికి బ్రోకర్ గా ఉన్న కానిస్టేబుల్ ని ఎసిబి అరెస్ట్ చేసింది. పర్భానికి చెందిన ఒక వ్యాపారి వాహనం యాక్సిడెంట్ చేసింది. దానిలో అతడి కంపెనీకేచెందిన ఉద్యోగి మరణించాడు. ఈ కేసుకు సంబంధించి వ్యాపారి , చనిపోయిన ఉద్యోగి భార్యతో మాట్లాడాడు. కంపెనీలోని ఒక ఉద్యోగి ఫోన్ నుంచి ఆమెతో మాట్లాడే సమయంలో కొన్ని అభ్యంతరకరమైన విషయాలు మాట్లాడాడు. అయితే ఆ ఫోన్లో కాల్ రికార్డింగ్ సౌకర్యం ఉండటంతో , ఇది బయటపడింది. దీన్ని ఆసరాగా చేసుకొని , డిఎస్పీ వ్యాపారిని పిలిపించి , డబ్బులు ఇవ్వకపోతే కేసుపెట్టి జైలుకు పంపుతానని బెదిరించాడు. 2 కోట్లు లంచం డిమాండ్ చేసాడు. చివరకు ఒకటిన్నర కోతికి ఒప్పందం కుదిరింది. ఇందులో 10 లక్షలు అడ్వాన్స్ మొత్తాన్ని డిఎస్పీ ఇంట్లో కానిస్టేబుల్ కి అందిస్తుండగా , ఎసిబి పట్టుకొని అరెస్ట్ చేసింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?