తలాక్ ఇచ్చేసిన 9 ఏళ్లకు మళ్ళీ పెళ్లిచేసుకోమని..

    0
    1190

    తలాక్ ఇచ్చేసిన 9 ఏళ్లకు మళ్ళీ పెళ్లిచేసుకోమని వత్తిడి చేసిన భర్తపై పోలీసులు కేసు పెట్టారు. రియాజుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి , మజ్లీస్ పార్టీ నాయకుడు,.తనకు పెళ్ళై భార్యకు విడాకులు ఇచ్చేసానని అబద్దం చెప్పి పెళ్లిచేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత , ఒక బిడ్డపుట్టాడు . తరువాత ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. రెండేళ్లు తిరక్కముందే మూడు సార్లు తలాక్ చెప్పేశాడు. ఆమెను వదిలేసి మరో పెళ్లిచేసుకున్నాడు.. ఇప్పుడు తొమ్మిదేళ్ల తరువాత నాలుగు పెళ్లిళ్లు , నాలుగు తలాక్ లు చెప్పేసి , మళ్ళీ పాతబార్య దగ్గరకొచ్చాడు. తలాక్ ఇచ్చిన ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే , ఆమె మరొకరిని పెళ్లిచేసుకొని , తర్వాత అతడిచేత ఆమెకు తలాక్ ఇప్పించి పెళ్లిచేసుకోవాలి. అందుకోసం తన ఫ్రెండ్ ను ఒకడిని తీసుకొచ్చాడు. అతడిని పెళ్లిచేసుకోమని రియాజుద్దీన్ ఆమెపై దౌర్జన్యం చేసాడు. పెళ్లి తరువాత ఆమెకు తలాక్ ఇప్పించి , మళ్ళీ ఆమెను తానే పెళ్లిచేసుకోవాలన్నది అతడి ప్లాన్.. అయితే ఆమె ఇందుకు ఒప్పుకోకపోవడంతో దౌర్జన్యం చేసాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్