బ్రష్ చేసుకున్న తరువాత ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది..?

    0
    913

    ఉదయాన్నే బ్రష్ చేసుకున్న 18 ఏళ్ళ అప్సనాఖాన్ అనే అమ్మాయి చనిపోయింది.. ఎందుకో తెలుసా..? టూత్ పేస్ట్ అనుకొని ఎలుకలు చంపే మందున్న ట్యూబ్ లో పేస్ట్ బ్రష్ మీద వేసుకుంది.. కొద్దిసేపటికే దాన్ని ఊసేసి , టూత్ పేస్ట్ వేసుకుంది.. ముందురోజురాత్రి కుటుంబ సభ్యులు ఎలుకలకు మందు పెట్టి , టూత్ పేస్ట్ స్థానంలో దాన్ని ఉంచేశారు. దీంతో పొరపాటుగా అమ్మాయి పేస్ట్ అనుకొని ఎలుకల మందు వేసుకొని , ఒక సారి బ్రష్ చేసిన తరువాత పొరపాటు తెలుసుకొని , నీటితో నోరు పుక్కిలించి , పేస్ట్ వేసుకుంది. ఇంట్లో తిడతారని ఆ విషయం చెప్పలేదు.

    యధాప్రకారం టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళింది. అక్కడ అమ్మాయికి , తలా తిరగడం , కడుపులో తిప్పడం , వాంతులు కావడంతో ఈ విషయం తల్లితండ్రులకు చెప్పింది. మూడు హాస్పిటల్స్ లో ప్రయోజనం లేదని తిప్పి పంపేసిన తరువాత , ఆమ్మాయి అసలు విషయం చెప్పింది. అప్పటికే పరిస్థితి విషమించింది. ముంబైలోని జేజే హాస్పిటల్లో చేర్చారు. వారం రోజులు తర్వాత నిన్ననే చనిపోయింది. ఆమె రక్త , ఇతర పరీక్షల్లో కూడా విష ప్రభావం కారణంగా చనిపోయినట్టు తేలింది.. ముంబైలోని ధారవైలో జరిగిందీ దారుణం..

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్