మారుతి ఎలెక్ట్రిక్ కార్లు ఎప్పుడొస్తాయో తెలుసా ..?

  0
  2289

  ఇండియాలో మారుతి ఎలెక్ట్రిక్ కార్లు ఎప్పుడొస్తాయో తెలుసా ..? ఇప్పుడు అన్ని కంపెనీలు ఎలెక్ట్రిక్ కార్లపై దృష్టి పెట్టాయి.. ఇండియాలో కార్ల వాహనాల రంగంలో అతిపెద్ద కంపెనీ మారుతీకూడా ఎలెక్టిక్ కార్లపై దృష్టి పెట్టింది.. అదిగో మారుతి ఎలెక్ట్రిక్ కారు.. ఇదిగో మారుతి ఎలెక్ట్రిక్ కారు అంటూ రకరకాల ఫొటోలతో వార్తలొచ్చాయి.. అయితే ఇప్పుడు మారుతి మార్కెటింగ్ హెడ్ శ్రీవాస్తవ , చల్లగా అసలు విషయం చెప్పేసాడు. 2025కి గానీ మారుతి హైబ్రిడ్ కారు రాదని చెప్పారు. అంటే మరో నాలుగేళ్లు మారుతి ఎలెక్ట్రిక్ కారు మాటే లేదన్నమాట..

  ప్రస్తుత్తం ఎలెక్ట్రిక్ బ్యాటరీ ధర అధికంగా ఉందని , అంత రేటు పెట్టి ఇవ్వలేమని , 2025కి ఎలెక్ట్రిక్ కారు బ్యాటరీ ధర తగ్గుతుందని , అప్పుడు ఆలోచిస్తామని అన్నారు. అప్పటికీ ఛార్జింగ్ స్టేషన్ల సమస్య , ఛార్జింగ్ అదాపటర్ల సమస్య , ఇలాంటివెన్నో ఉన్నాయని , వీటిని ఆలోచించకుండా , ప్రభుత్వం ఏదో సబ్సిడీలు ఇస్తుందని చేస్తే , సమస్యలు వస్తాయన్నారు. దీనికంటే కార్ల నుంచి వెలువడే కర్బన పదార్థాలను తగ్గించే టెక్నాలజీతోపాటు , సీఎన్జీ వాహనాలను ప్రోత్సహించాలని కోరారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.