యుపీలో ములాయం కుటుంబంలో ముస‌లం…

  0
  789

   

  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ములాయంసింగ్ యాద‌వ్ కుటుంబంలో ముస‌లం పుట్టింది. ములాయం సింగ్ యాద‌వ్ చిన్న‌కోడ‌లు అప‌ర్ణ అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మాణానికి 11 ల‌క్ష‌ల విరాళం అంద‌చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ, ములాయం సింగ్ యాద‌వ్ ల మ‌ధ్య ఉప్పు, నిప్పుగా ఉంది.

  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం సీఎం యోగీ, ములాయం సింగ్ యాద‌వ్ ల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతోంది. పెద్ద‌కొడుకు అఖిలేష్ యాద‌వ్ ను ముందుపెట్టి ములాయం రాజ‌కీయం న‌డిపిస్తున్నాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇద్ద‌రి మ‌ధ్య ఎడ‌తెగ‌ని పోరు జ‌రుగుతుండ‌గా ములాయం కుటుంబంలోని చిన్న‌కోడ‌లు అప‌ర్ణ రామ‌మందిరం నిర్మాణం కోసం విరాళం ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

  దీంతో ములాయం కుటుంబంలో చీలిక వ‌చ్చిన‌ట్ల‌యింది. రామ నామం, రాముడి వ్య‌క్తిత్వం ఈ దేశానికి ఆద‌ర్శ‌మ‌ని… అవి రెండూ దేశాన్ని ముందుకు న‌డిపిస్తాయ‌ని, ప్ర‌జ‌లంతా రాముడిని న‌మ్ముకోవాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?