ప్రపంచంలోనే కాస్ట్ లీ బెండకాయలు..

    0
    275

    అన్ని వస్తువులు ఒకటే, కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకునే టెక్నిక్ లోనే ఉంటుంది అంతా. ఆ టెక్నిక్ కనిపెట్టిన ఓ రైతు కేజీ బెండకాయల్ని ఏకంగా 800 రూపాయలకు అమ్మేస్తున్నాడు. ఆ టెక్నిక్ మరేంటో కాదు, జస్ట్ ఆయన అమ్ముతున్న బెండకాయలు గుండె జబ్బుల్ని, బీపీ, షుగర్ ని కంట్రోల్ చేస్తుందని చెప్పాడు. ఇంకేముంది పొలోమంటూ అందరూ ఆ బెండకాయలపై ఎగబడ్డారు. కేజీ 800 రూపాయలని చెప్పినా కొనుక్కుని వెళ్లిపోయారు.

    ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో అయితే రూ.30 నుంచి రూ.40 మధ్య ధర పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లా కజురీ కలాన్‌కు చెందిన రైతు మిస్రీలాల్‌ రాజ్‌పుత్‌ పండిస్తున్న ఎరుపు రంగు బెండకాయల ధర మాత్రం ఏకంగా రూ.800 వరకు పలుకుతోంది. సాధారణ ఆకుపచ్చ రంగు బెండకాయలతో పోల్చితే తాను పండించేవి మరింత ఆరోగ్యకరమని రైతు చెబుతున్నారు. ‘‘నేను సాగుచేసే బెండకాయలు ఎరుపు రంగులో ఉంటాయి. సాధారణ బెండకాయలతో పోల్చితే వీటిలో పోషక విలువలు ఎక్కువ. గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, అధిక కొవ్వుతో బాధపడేవారికి అత్యంత మంచివి’’ అని రాజ్‌పుత్‌ వివరించారు. ఎరుపు రంగు బెండకాయల ధర సాధారణ రకం కంటే అనేక రెట్లు ఎక్కువ పలుకుతోందని చెప్పారు. వారణాసిలోని ఓ పరిశోధన సంస్థ నుంచి 40 రోజుల క్రితం కేజీ విత్తనాలు కొని పొలంలో నాటానని తెలిపారు.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్