అటు ఏసు క్రీస్తు.. ఇటు వినాయకుడు..

  0
  218

  స్పెయిన్ లో జరిగిన ఓ సంఘటన మత సామరస్యానికి ఈ ప్రపంచానికి ఓ సంకేతం. స్పెయిన్ లోని భారతీయులు వినాయక ఊరేగింపు చేస్తుండగా ఆ ఊరేగింపు దారిలో చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. దీంతో చర్చిలో ప్రార్థనలు అయిపోయేంత వరకు వినాయకుడి ఊరేగింపు ఆపడమా లేక, చర్చి నిర్వాహకుల అనుమతితో చర్చి మీదుగా ఊరేగింపు కొనసాగించడమా అన్న మీమాంశ ఏర్పడింది. ఈ విషయం తెలిసిన చర్చి అధికారులు నేరుగా వినాయకుడి ఉత్సవం వద్దకు వచ్చి వినాయకుడి ఉత్సవ విగ్రహాన్ని చర్చిలోకి తీసుకెళ్లి, కాసేపు ప్రార్థనలు చేసి, ఆ తర్వాత ఘనంగా బయటకు సాగనంపారు. మతసామరస్యానికి ఇదో ప్రతీకగా చెబుతున్నారు. ప్రతి ఏటా స్పెయిన్ లో ఇలాగే వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. అనంతరం ఘనంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్