ఆ ఉద్యోగాలకు కరోనా డిగ్రీ బ్యాచ్ కూడా అర్హులే.

  0
  69

  కరోనా టైమ్ లో ఎగ్జామ్స్ లేకుండా అందర్నీ పాస్ చేయించడం మరీ జోక్ అయిపోయింది. కరోనా బ్యాచ్ అనే ముద్రపడిపోయే సరికి 2021లో పాస్ అయినవారికి అవకాశాలివ్వడానికి ప్రైవేట్ కంపెనీలు కూడా వెనకాడుతున్నాయి. ఈ క్రమంలో హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ వెలువరించిన ఓ ఉద్యోగ ప్రకటన ఆసక్తికరంగా మారింది. డిగ్రీ విద్యార్థులకోసం ఇచ్చిన ఆ ప్రకటనలో 2021 బ్యాచ్ విద్యార్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోడానికి అనర్హులు అంటూ ఓ లైన్ ఉంది. దీంతో కరోనా బ్యాచ్ అనే నిందపడిన విద్యార్థులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ మధురై బ్రాంచ్ ఈ ప్రకటన విడుదల చేసింది.


  మా తప్పేంటి..?
  ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఆల్ పాస్ అంటే.. అది తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ ఇచ్చిన ప్రకటనపై మండిపడ్డారు. దీంతో బ్యాంక్ తప్పు దిద్దుకుంది. ఆ ప్రకటనలో టైపింగ్ మిస్టేక్ ఉందని చెప్పింది. 2021 బ్యాచ్ నాట్ ఎలిజిబుల్ అనే ప్లేస్ లో 2021 బ్యాచ్ ఆల్సో ఎలిజిబుల్ అని చదువుకోవాలని చెప్పింది. తప్పు దిద్దుకుని మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

  వయస్సు అర్హత ఉన్న వారంతా ఏ సంవత్సరంలో ఉత్తీర్ణులయినా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో నిరుద్యోగులు శాంతించారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?