ఓలా తగలబెట్టిన వ్యక్తికీ మరో ఓలా ఫ్రీ..

  0
  1254

  ఇటీవల కాలంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లు కంపెనీ ఓలా వివాదాల్లో పడిపోయింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఓలా స్కూటర్లు బ్యాటరీలు పేలి పోవడం , స్కూటర్లు కాలిపోవడం , దాంతో కొంత మంది చనిపోవడం జరిగింది. ఇలా వరుస దుర్ఘటనలతో ఓలా స్కూటర్ నాణ్యత పైనే అనుమానాలు నెలకొన్నాయి . ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరుపత్తూర్ కి చెందిన పృథ్వి రాజ్ అనే వ్యక్తి ఓలా స్కూటర్ కొనుగోలు చేసిన మూడు వారాల్లోనే విసిగిపోయి నడిరోడ్లో ఆ స్కూటర్ పై పెట్రోల్ పోసి కాల్చి వేసిన సంగతి తెలిసిందే. గుడియాతం నుంచి తిరుపత్తూర్ వరకు స్కూటర్ పై ప్రయాణం చేస్తున్నప్పుడు అది 50 కిలోమీటర్ల పరిధిలో ఆరు సార్లు ఆగిపోయింది.

  ఇదివరకే కంపెనీ చెప్పినట్టు ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్ కి 181 కిలోమీటర్లు రావడం లేదు . దాంట్లో సగం కూడా మైలేజీ రావడంలేదు . వీటన్నింటితో విసిగిపోయిన పృథ్వీరాజ్ ఒక దగ్గర ఆగి పోయిన తన స్కూటర్ రోడ్డు పక్కకు పెట్టి స్నేహితులకు ఫోన్ చేసి రెండు లీటర్ల పెట్రోలు తెప్పించి దానిమీద పోసి కాల్చి పారేశారు . ఈ స్కూటర్ వల్ల అనవసరమైన టెన్షన్ పడుతున్నానని అందుకే పీడా విరగడ అవుతుందని , తగలబెట్టానని అన్నాడు . ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఓలా స్కూటర్ క్వాలిటీ పై చర్చ జరగడంతో ఓలా కంపెనీ పృధిరాజ్ కి మరో ఓలా ప్రో – 1 స్కూటర్ ను ఉచితంగా బహుకరించింది . ఇలా ఎందుకు జరిగిందని టెక్నికల్ టీం పరిశీలిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.