మీసంతిప్పినా ఎందుకిలా అయింది.. ??

  0
  493

  మీసంతిప్పినా ఎందుకిలా అయింది.. ??
  పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణకు నియోజకవర్గంలో చుక్కెదురైంది. హిందూపురం నియోజకవర్గంలో హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. 8 చోట్ల మాత్రమే టిడిపి విజయం సాధించింది. గత ఎన్నికల్లో రాయలసీమలో గెలిచిన ఇద్దరిలో బాలకృష్ణ ఒకరుకాగా , మరొకరు కుప్పం నుంచి చంద్రబాబునాయుడు. పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని బాలకృష్ణ , తన పార్టీనేతలకు ఆదేశాలిచ్చినా , అన్ని స్థానాల్లో పోటీ పెట్టారే తప్ప గెలుపు చేజిక్కుంచుకోలేకపోయారు. కుప్పలోకూడా అత్యధిక స్థానాల్లో వైసిపి గెలిచిన విషయం తెలిసిందే..

  పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్‌ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది. బీకే పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది.
  పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చేదు అనుభవం ఎదురైంది. నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ ఓటమి చెందింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓటమి పాలైంది.

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?