చెల్లి ఎవరో ? లవర్ ఎవరో ?? పాపం కుర్రాడు.

  0
  857

  ఎవరితో అయినా డేటింగ్ చేద్దామంటే అతనికో భయం.. అమ్మాయి ఎవరైనా ఐ లవ్ యు ..అంటూ ముందుకొస్తే అనుమానం. జెవ్ ఫోర్స్ అనే యువకుడుది ఇలాంటి సంకట పరిస్థితి పాపం… వరసకు ఎవరు చెల్లెలు అవుతుందో , అక్క అవుతుందో తెలియదు.. లవ్ చేద్దామన్నా , డేటింగ్ చేద్దామన్నా , పెళ్లి చేసుకుందామన్నా అతడికి అదే భయం..అందువల్లే అతడు డేటింగ్‌ యాప్‌ వాడటానికి ఇబ్బంది పడుతున్నాడు. యూఎస్‌లోని ఓరెగాన్‌ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల జేవ్‌ ఫోర్స్‌ కి జీవితంలో ఎవరికీ రాకూడని పరిస్థితి ఎందుకో చూడండి.

  తండ్రి వీర్య దానం తెచ్చిన చిక్కు..

  జేవ్‌ తండ్రి వయసులో ఉన్నప్పుడు 500 సార్లు తన వీర్యాన్ని దానం చేశాడట. దీంతో వారి రాష్ట్రంలోనే అనేక మంది అతడి వీర్యంతో సంతానం పొందిన వారున్నారు. ఇప్పుడు వారంతా దాదాపు జేవ్‌ వయస్కులే. ఇప్పుడు వాళ్లూ కూడా డేటింగ్‌ యాప్‌ను ఉపయోగిస్తూ ఉండొచ్చు. తను డేటింగ్‌ యాప్‌ను వాడితే పొరపాటున ఎక్కడ తన తండ్రి వీర్యంతో జన్మించిన అమ్మాయిలతో ప్రేమలో పడతాడేమోనని భయపడుతున్నాడు. అలాంటి అమ్మాయిలకు తల్లులు వేరుగా ఉన్న జన్యుపరంగా జేవ్‌ తండ్రే జన్మనిచ్చినట్లుగా భావించాలి. అంటే వారంతా జేవ్‌కు వరుసగా సోదరీమణులవుతారు.

  అమ్మాయిల జోలికి పోవాలంటే భయమే..

  ఇప్పుడు ఈ సమస్యే జేవ్‌ ఎవర్నీ ప్రేమించడానికి వీల్లేకుండా చేస్తోంది. ఇప్పటికే జేవ్‌ ఎనిమిది మంది తోబుట్టువులను గుర్తించాడట. అందులో ఒకరు తను చదువుకున్న పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశారట. ఈ మధ్యే ఆ విషయం తెలిసి జేవ్‌ ఆశ్చర్యపోయాడు. అంతేకాదు.. తన తండ్రి వీర్యం ద్వారా జన్మించిన ఇద్దరు సోదరులు ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నారట. ఇలా ఎవరిని కలిసినా తన సోదరులు/సోదరీలు అవుతారోనని ఆందోళన చెందుతున్నాడు. అందుకే అమ్మాయిల జోలికి పోకుండా భయపడుతున్నాడు..

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?