పిల్లలు కాదు పిడుగులు.. వైఫై డివైజ్ తయారు చేశారు..

    0
    1976

    వైఫై సిగ్నల్ రావాలంటే రూటర్ ఉండాలి. కనీసం 2 వేల రూపాయలు లేందే ఓ మోస్తరు రూటర్ ని కొనలేం. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్ల ఇంజినీర్లు మాత్రం ఇంట్లో దొరికే వస్తువులతోనే వైఫై రూటర్ తయారు చేశారు. వీళ్లేమీ ఇంజినీరింగ్ స్టూడెంట్లు కాదు, జస్ట్ పదోతరగతి చదువుతున్నారంతే. కానీ టెక్నాలజీలో మాత్రం టాప్ అనిపించుకున్నారు.

    ఈ ప్రయోగంలో వాడే వస్తువులు ఏంటంటే.. ఓ అయస్కాంతం, రెండు బ్లేడ్లు, ఛార్జింగ్‌ వైర్‌.. ఈ మూడు వస్తువులతోనే ఇంట్లోనే వైఫై సిగ్నల్స్‌ను ఈజీగా అందుకోవచ్చునంటున్నారు ఈ విద్యార్థులు. విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలోని జడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు గణేష్‌, వేణు, సాత్విక్‌.. తమ ఉపాధ్యాయుడు ఇటీవల విద్యుదయస్కాంత తరంగాల గురించి పాఠం చెప్పినప్పుడు ఇన్స్ పి రేషన్ పొందారు. స్పీకర్లలో ఉండే అయస్కాంతానికి బ్లేడ్లు, ఛార్జింగ్‌ వైర్‌ను ఉపయోగించి వైఫై సిగ్నల్స్‌ వచ్చేట్లుగా చేయగలిగారు. అయస్కాంతంపై ఉన్న రెండు బ్లేడ్లకు పెట్టిన ఛార్జింగ్‌ వైరును మొబైల్‌ ఫోన్‌కు జత చేయగానే వైఫై సిగ్నల్స్‌ కనెక్టవుతున్నాయని సాత్విక్‌ తెలిపాడు. వీరు చేసిన పరిశోధన పట్ల లక్ష్మీపురం జడ్పీ హైస్కూల్‌ ఫిజిక్స్‌ అధ్యాపకుడు రామకృష్ణ హర్షం వ్యక్తం చేసి వారిని అభినందించాడు. వీరిని సరైన రీతిలో ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని ఆయన చెప్పారు.

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు..