తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ సైకిల్ దిగి కారెక్కేస్తున్నారు..

  0
  82

  తెలంగాణలో దారానికి వేలాడుతున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. మొదట్నుంచి ఆ పార్టీనే నమ్ముకుని ఉన్న ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లోనే టీడీపీ కార్యాలయంలో ఆయన ఒక్కడే ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉండేవారు. పార్టీ కార్యక్రమాలు ఉన్నా లేకున్నా ఆఫీస్ ని కనిపెట్టుకుని ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్తున్నారు. మంత్రి టి.రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో, మంచి బీసీ నాయకుడికోసం టీఆర్ఎస్ చేసిన అన్వేషణలో రమణకు గాలం వేశారు. ఇప్పటికే రమణతో టీఆర్ఎస్ మంత్రులు, సీనియర్ నాయకులు చర్చించారు. రమణ కూడా పార్టీ మారేందుకు ఆసక్తితో ఉన్నారు. టీఆర్ఎస్ లో చేరే విషయంలో ఎవరైనా అడిగితే కాదని చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు. పరోక్షంగా పార్టీ మారుతున్నట్టు సూచనలు కూడా ఇస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ వస్తే రెండ్రోజుల్లో ఆయన పార్టీ మారే అవకాశం ఉంది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..