ప్రాంక్ వీడియో ఆకతాయికి ఐదేళ్లు జైలు..

  0
  341

  ప్రాంక్ వీడియో హోటల్లో కస్టమర్లను భయపెట్టిన ఓ వెధవకు ఐదేళ్లు జైలు శిక్ష పడింది. మాలిక్ అనే 19 ఏళ్ళ కుర్రాడు , అమెరికాలోని మన్హట్టన్ లో , ఒక హోటల్ లోకి పోయాడు. డైనింగ్ టేబుల్స్ ముందు నిలబడి , తాను మానవ బాంబునని , రెండు నిమిషాల్లో , తనను తాను పేల్చుకుంటానని , అందరినీ తనతోపాటు అల్లా దగ్గరకు తీసుకుపోతానని బెదిరించాడు. అల్లాహో అక్బర్ అంటూ పదే పదే అరిచి వాళ్ళను భయపెట్టాడు.. ఇలా భయ పెడుతూనే మరోవైపు ఈ తతంగాన్నంతా లైవ్ వీడియో చేస్తున్నాడు. కొద్దిసేపటి తరువాత , ఇది జస్ట్ , ప్రాంక్ వీడియో అని చెప్పాడు.. ఇంతలో పోలీసు వచ్చి , వాడికి బేడీలు వేసి బొక్కలో తీశారు.. ఇప్పడీ కేసు విచారణ పూర్తి అయిపోయి , మాలిక్ కు ఐదేళ్ల శిక్ష విధించారు.. ఇలాంటి ప్రాంక్ వీడియోల పేరుతొ , అమ్మాయిలను వేధించడం , నడిరోడ్లో భయపెట్టడం , అసభ్యంగా ప్రవర్తించడంలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగాఉన్నాయి.. ఇలాంటి శిక్షలు మన దేశంలో కూడా విదిస్తే , ఆకతాయి వెధవలకు అడ్డుకట్ట వెయ్యొచ్చు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.