కిడ్నీ 160 గ్రాములు, అతడి కిడ్నీ 35 కిలోలు..

    0
    282

    మానవ దేహంలో ఉన్న కిడ్నీ బరువు కుడివైపు కిడ్నీ 80 నుంచి 160 గ్రాముల బరువు ఉంటే, ఎడమవైపు కిడ్నీ 83నుంచి 176 గ్రాములు ఉంటుంది. అయితే 35 కేజీల బరువున్న కిడ్నీలున్న మనిషి పరిస్థితి ఏంటో ఊహించుకోండి. వారెన్ హిక్స్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా 35 కేజీల కిడ్నీలతో బాధపడుతున్నాడు. ఇతనికి పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి ఉందని వైద్యులు నిర్థారించారు. కిడ్నీల్లో ద్రవం చేరుకోవడంతో వారెన్ హిక్స్ కిడ్నీలు వాచి బరువెక్కిపోయాయి. దీంతో అతనికి ఊపిరి పీల్చుకోవడం కష్టమై చావుకి దగ్గరపడ్డాడు.

    వారెన్ కుడివైపు కిడ్నీ 15కేజీలు ఉండి.. దాంట్లో 5 లీటర్ల ద్రవం ఉంది. ఎడమవైపు కిడ్నీ 20కిలోలు ఉంది. ఈ కిడ్నీలు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో వారెన్ చావుకి దగ్గరపడ్డాడు. దీంతో వారెన్ కు ఆపరేషన్ చేసి ఆ రెండు కిడ్నీలు తొలగించి వేశారు. ఒక కృత్రిమ కిడ్నీని అమర్చారు. కిడ్నీలు అలా విపరీతంగా పెరిగిపోవడంతో అతడి ఊపిరితిత్తులు, కడుపు, గుండె కూడా దెబ్బతిన్నాయి. గతంలో మన దేశంలోనే ఓ వ్యక్తి ఏడున్నర కిలోల కిడ్నీలతో ప్రపంచ రికార్డ్ స్థాపించగా, ఇప్పుడు బ్రిటన్ లో విండ్సర్ కి చెందిన వారెన్ 35 కిలోల కిడ్నీలతో ప్రపంచ రికార్డ్ స్థాపించాడు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..