చైనాలో పాతాళం.. శాస్త్రవేత్తల ఆశ్చర్యం..

  0
  200

  ప్ర‌పంచంలో ఒక అద్భుత‌మైన వింత చైనాలో బ‌య‌ట‌ప‌డింది. 630 అడుగుల లోతున ఉన్న ఓ గొయ్యిలో పెద్ద కీకార‌ణ్యం ఉంది. ప్ర‌పంచంలో ఇంత‌వ‌ర‌కు శాస్త్ర‌వేత్త‌ల‌కు తెలిసింది 30 లోతైన గొయ్యిలే. ఇవి కూడా చైనాలోని లేకౌంటీ అనే స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన ప్రాంతంలో ఉన్నాయి. 630 అడుగుల ఈ అతి లోతైన గోతిని జువాంగ్ ప్రాంతంలోని కీకార‌ణ్యంలో క‌నుగొన్నారు.

  ఈ గోతిలో చెట్లు 131 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఇంత‌వ‌ర‌కు మ‌నం చూడ‌ని జీవ‌జాలం కూడా ఈ లోయలో ఉండి ఉండ‌వ‌చ్చున‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. 630 అడుగుల లోతు, 1000 అడుగుల పొడ‌వు, 490 అడుగుల వెడ‌ల్పుతో ఈ గొయ్యి ఉంది.

  ప‌ర్వ‌తారోహ‌కులు, గుహ‌ల ప‌రిశోధ‌కులు జువాన్ ప్రాంతంలోని ప‌ర్వ‌తాల్లో ప‌రిశోధ‌న‌లు చేస్తోన్న స‌మ‌యంలో ఇది బ‌య‌ట‌ప‌డింది. కొన్ని వేల ఏళ్ళ క్రిత‌మే ఈ గొయ్యి ఏర్ప‌డింద‌ని, దానిలో ఉన్న కీకార‌ణ్యాన్నిచూసి నిర్ధారించారు.

  ఇంత‌వ‌ర‌కు గోతిలోకి ప్ర‌వేశించ‌క‌పోయినా, కెమెరాలు పంపించి చూశారు. 7 అడుగుల పొడ‌వైన ఆకులు గ‌ల చెట్లు కూడా ఇక్క‌డ ఉన్నాయ‌ని తెలిపారు. ఈ గోతిలోకి దిగి ప‌రిశోధ‌న‌లు చేసేందుకు శాస్త్ర‌వేత్త‌లు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..