నాతో సెల్ఫీ కావాలా..? వందరూపాయలు మాత్రమే.. లేడీ మినిస్టర్ ఆఫర్.

  0
  155

  ఆమె ఓ మినిస్ట‌ర్… మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సాంస్కృతిక శాఖ మంత్రి.. పేరు ఉషాఠాగూరు. త‌న‌తో సెల్ఫీ దిగాల‌నుకుంటే వంద రూపాయ‌లు చెల్లించాల్సిందేన‌ని ష‌ర‌తు పెట్టంది. సెల్ఫీల వ‌ల్ల త‌న స‌మ‌యం చాలా వృధా అవుతోందని, అందుకే సెల్ఫీల కోసం స‌మ‌యం కేటాయించేందుకు వంద రూపాయ‌లు చెల్లించాల‌ని చెబుతోంది. లోక‌ల్ పార్టీ ఆఫీసులో డ‌బ్బులు క‌ట్టి, ఆ ర‌సీదును చూపిస్తే త‌న‌తో సెల్ఫీలు తీసుకోవ‌చ్చున‌ని ఆఫ‌ర్ ఇచ్చింది. ఆ వ‌చ్చిన న‌గ‌దును పార్టీ కోసం, పార్టీ అకౌంటుకి బ‌దిలీ చేస్తాన‌ని చెబుతోంది. ఇక వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు 500 రూపాయ‌లు పీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల‌ని కోరింది. ఒక్కో డోసును కేంద్రం 250 రూపాయ‌ల‌కు కొనుగోలు చేస్తోంద‌ని, రెండు డోసుల‌కు క‌లిపి 500 రూపాయ‌లు అవుతోంద‌న్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారంతా ఇచ్చిన డ‌బ్బుల‌ను పేద‌ల సంక్షేమానికి వినియోగించ వ‌చ్చున‌ని తెలిపింది. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చేవారు పూలు, బొకేలు తీసుకురావొద్ద‌ని, అలంకార ప్రియుడైన‌ విష్ణుమూర్తికి స‌మ‌ర్పించాల‌ని సూచించింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?