ఐపీఎస్ , పోలీస్ .. నాచావుకు కారణం వాళ్ళే .

  0
  206

  32 ఏళ్ళ మహిళా బ్యాంకు అధికారి ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ సంచలనమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో శ్రద్దాగుప్త అనే మహిళ డెప్యూటీ మేనేజర్ గా పనిచేస్తోంది. ప్రస్తుత్తం ఫైజాబాద్ లో పనిచేస్తున్న యువతి , ఒక అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉంటుంది. నిన్న ఉదయం పాలుపోసే వ్యక్తి బెల్ కొట్టినా తీయలేదు. దీంతో కిటికీలోనుంచి చూస్తే , ఆమె ఉరివేసుకొని ఫ్యానుకు వేలాడుతొంది. విషయం పోలీసులకు చెప్పడంతో , తలుపులు పగలకొట్టి చూసారు. తన చావుకు వివేక్ గుప్తా , ఐపీఎస్ అధికారి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్పీ ఆశిష్ తివారి , ఫైజాబాద్ పోలీస్ అనిల్ తివారి కారణమని పేర్కొంది.. వివేక్ గుప్త అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి కుదిరిందని కూడా చెబుతున్నారు. అయితే అతడిపేరు సూసైడ్ నోట్ లో రాయడమే ఇప్పుడు సంచలనమైంది. ఈ లేఖలో ఆమె ఐపీఎస్ అధికారులే తన చావుకి కారణమని చెప్పడంతో , విచారణకు ఆదేశించాలని ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ కోరారు. దీన్ని తీవ్రంగా తీసుకోవాలని అన్నారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..