జైల్లో ఆర్యన్ స్టోరీచెప్పి జైలుకెళ్లిన దొంగ

  0
  4798

  రేటింగ్స్ వస్తాయనుకుంటే అడ్డమైన వాడితో ఇంటర్వ్యూలు చేసి , సెన్సేషన్ చేయడం మన టీవీలకు అలవాటే.. అయితే శ్రావణ్ నాడార్ అనే 40 ఏళ్ళ దొంగ , ఆర్యన్ గురించి ఛానెల్స్ లో మాట్లాడి పోలీసులకు చిక్కిపోయాడు. 13 దొంగతనం కేసుల్లో మూడు రాష్ట్రాల పోలీసు వీడికోసం వెదుకుతున్నారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ జైలుకి పోయినప్పుడే , శ్రావణ్ నాడార్ కూడా జైలుకెళ్లాడు. అక్కడ ఆర్యన్ తో మాట్లాడాడు. జైల్లోకి వస్తూనే పెద్దగా ఏడ్చాడని , తాను ఓదార్చానని శ్రావణ్ నాడార్ చెప్పాడు.

  ఆర్యన్ కంటే వారం ముందే శ్రావణ్ నాడార్ కి బెయిల్ వచ్చింది. దీంతో ఆర్యన్ కి బెయిల్ వచ్చిందని విన్నవెంటనే శ్రావణ్ నాడార్ జైలుదగ్గరకు వెళ్ళాడు. అయితే ఆర్యన్ విడుదల ఆలస్యం కానుందని తెలుకొని తిరిగిపోతుండగా , తనకు ఆర్యన్ జైల్లో తెలుసునని మీడియాకు చెప్పాడు. అంతే మీడియా శ్రావణ్ నాడార్ ని చుట్టేసింది. జైల్లో ఎలాఉన్నాడో , ఎలా ఏడ్చాడో శ్రావణ్ నాడార్ చెప్పాడు. ఇతడి కధలన్నీ టీవీల్లో రావడంతో , వీడికోసం గాలిస్తున్న పోలీసు అలర్ట్ అయ్యారు.. వెంటనే శ్రావణ్ నాడార్ ని వెదికి పట్టుకొని మళ్ళీ జైలుకు పంపారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..