సీఎంకు.. ముద్దు మీద ముద్దు, ఆపినా ఆగలేదు.

  0
  639

  సీఎంకు.. ముద్దు మీద ముద్దు..ఆపినా ఆగలేదుగా..
  కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మైను ఓ మహిళ ముద్దులతో ముంచేసింది. ఒక్కముద్దుతో ఆగకుండా వరుసగా ముద్దులు పెడుతూ రచ్చ చేసింది. సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా.. వినిపించుకోకుండా తన ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేసింది.

  సాధారణంగా రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటూనే ఉంటారు. రాజకీయ నాయకుల పర్యటనల సమయంలో వీరు హడావుడి చేయడం కూడా మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ నాయకులకు దిష్టి తీయడం, పూలతో స్వాగతం పలకడం కూడా చూస్తూనే ఉంటాం. మరి కొందరైతే శాలువాలతో సత్కరించడం కూడా చూస్తుంటాం.

  అయితే తాజాగా కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మైకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. గుట్టహళ్లిలో జనసేవక్‌ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. కార్యకర్తల కోలాహలం మధ్య.. ఓ మహిళ అకస్మాత్తుగా బొమ్మై చేతిని పట్టుకొని ముద్దు పెట్టింది. అయితే ఆ మహిళ ఒక్క ముద్దుతో సరిపెట్టలేదు. వరుసగా ఆయన చేతిని ముద్దాడుతోనే ఉంది. దీంతో సీఎం బొమ్మై షాకయ్యారు. ఇతరులు వారించినా వినకుండా మహిళ ముద్దులు పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..