ఈ పెళ్లికూతురు ఎవరో తెలిస్తే గర్విస్తాం..

    0
    68

    మన దేశంలో పెళ్లిళ్లు, పెళ్లి కూతుళ్లు, పెళ్లి కొడుకులు.. మన సంస్కృతి సంప్రదాయాలు మరచిపోయి వికృత నాగరిక సంస్కృతిలో విహరిస్తుంటే ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్న ఓ బ్రిటిష్ యువతి భారతీయ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం తనకు పెళ్లి జరగాలని పట్టుబట్టి మరీ పెళ్లి పీటలెక్కింది.

    ప్రేమించి పెళ్లాడినవాడు కూడా భారతీయుడే కావడంతో ఆమె కలలు నిజమయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరో చెబితే ఆశ్చర్యపోతారు. మన దేశంలోని బ్రిటిష్ రాయబారి కార్యాలయంలో దక్షిణాసియా గ్రేడ్ కమిషనర్ గా ఉన్నారు. అత్యున్నతమైన ఉద్యోగం అది. ఆమె నాలుగేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం ఇండియాకు వచ్చారు. ఇక్కడే హిమాన్షు పాండే అనే యువకుడిని ప్రేమించి పెళ్లాడారు.

    షార్ట్ ఫిల్మ్స్, థీమ్ ఫిల్మ్స్ తీసే హిమాన్షుకి ఆమె ఓ ఫంక్షన్లో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి రోజు భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే అలంకరణ చేసుకుంది. వేద మంత్రాల మధ్య పెళ్లి కొడుకుచేత తాళి కట్టించుకుంది.

    ప్రతి ఒక్కటీ భారతీయ సంప్రదాయం ప్రకారం చేసుకున్న రియనాన్ హ్యారిస్.. పుట్టుకతో తాను క్రిస్టియన్ అయినా, భారత దేశంలో ఉన్న నాలుగేళ్లలో భారతీయత, భారతీయ సాంప్రదాయాలు, వేదాలు, పురాణ ఇతిహాసాలపై చాలా అధ్యయనం చేశానని చెప్పింది. సర్వమత సమానత్వాన్ని ఒక్క హిందూ మతమే బోధించిందని కూడా పేర్కొంది.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..