సగం గుండు గీయించుకొని , దాంట్లో బంగారం స్మగ్లింగ్..

  0
  292

  బంగారం పేస్ట్ ఎక్కడ పెట్టుకున్నాడో తెలిస్తే షాక్..

  కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా పెట్టినా, విదేశాలనుంచి బంగారం స్మగ్లింగ్ ఆగడంలేదు. ఏదో ఒక మార్గంలో బంగారం, డ్రగ్స్.. తీసుకొచ్చేస్తున్నారు, ఇతర దేశాలకు తరలించేస్తున్నారు. స్మగ్లర్లకు ఎన్ని ఉపాయాలున్నాయో.. అంతకంటే ఎక్కు వ ఉపాయాలతో కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ ని అరికడుతున్నారు. పట్టుకున్న ప్రతిసారీ మరో మార్గాన్ని ఎంచుకోవడం వీరికి పరిపాటి అయిపోయింది.

  ఇదిగో ఇక్కడ చూడండి.. వీడు మామూలోడు కాదు. షార్జా నుంచి వారణాసికి ఫ్లైట్ లో వచ్చాడు. వస్తూ వస్తూ బంగారాన్ని వెంట తెచ్చాడు. దాని విలువ దాదాపు 35 లక్షల రూపాయలు అయితే గతంలో ఎవరూ బంగారాన్ని తీసుకురాని విధంగా అతడు తలలో పెట్టుకుని తీసుకొచ్చాడు. ఎయిర్ పోర్ట్ లో దిగగానే వాడి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి అంతా చెక్ చేశారు. ఎక్కడా బంగారం ఆనవాళ్లు దొరకలేదు. చివరికి మళ్లీ రెండోసారి స్కానింగ్ కి పంపించారు. తలలో ఏదో ఉన్నట్టు అనుమానం వచ్చింది. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇదీ సంగతి.

  తలని అరగుండు చేసి, మధ్యలో వెంట్రుకలు తీసేశాడు. సరిగ్గా నడి నెత్తిన బంగారం పేస్ట్ ని అతికించుకున్నాడు. చుట్టూ విగ్గు పెట్టుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకండా ఆ విగ్గుని సవరించుకుంటూ వస్తున్నాడు. చివరికి కస్టమ్స్ అధికారులు ఆ విగ్ తీసి అసలు సంగతి కనిపెట్టారు. ఓ పట్టాన విగ్గు రాకుండా చాలా తెలివిగా అతికించుకున్నాడు. విగ్గు తీసేటప్పుడు నెప్పి పుట్టినా కుయ్ కయమ మనలేదు. అంతబాగా నటించినా చివరికి దొరికిపోయాడు.

   

   

  https://www.facebook.com/watch/?v=636823077620532&extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&ref=sharing

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..