నక్సల్స్ చెరలో ఉన్న భర్తను విడిపించుకునేందుకు ఓ మహిళ ఏకంగా అడవిబాట పట్టింది. తన బిడ్డలతో ఆ మహిళ భర్తను వెతుక్కుంటూ మావోయిస్టుల వద్దకు వెళ్లాలని బయలుదేరింది. ఛతీస్ ఘడ్ లో ఇంద్రావతి నదిపై నిర్మిస్తున్న బీజాపూర్.. నారాయణ్ పూర్ సరిహద్దులో నిర్మిస్తున్న వంతెన నిర్మాణంలో ఇంజనీర్ గా పనిచేస్తున్న అశోక్ పవార్ ను నక్సలైట్లు ఈనెల 11న కిడ్నాప్ చేశారు. ఆయన భార్య సోనాలి, తనబిడ్డల మొహం చూసైనా భర్తను విడిచిపెట్టాలంటూ ఒక వీడియో కూడా విడుదల చేశారు.
ఆ తర్వాత నక్సలైట్లు ఇంజినీర్ పవార్ ను విడిచిపెట్టేశారు. అయితే ఈ విషయం తెలియని భార్య.. బిడ్డలతో కలిసి అడవుల్లోకి వెళ్ళింది. స్థానిక జర్నలిస్టుల సాయంతో మావోయిస్టులను కలవాలని బయలుదేరిపోయింది. అయితే జర్నలిస్టుల విచారణలో నక్సలైట్లు.. అశోక్ ను విడిచి పెట్టేశారని తెలియక అడవుల్లోకి వచ్చిందని స్థానికులు చెప్పారు. దీంతో జర్నలిస్టులు ఆమెను తిరిగి ఇంటికి పంపించివేశారు.
గతంలో కూడా మరొక ఇంజినీర్ లక్రా అనే వ్యక్తిని కిడ్నాప్ చేయగా.. అతడి భర్త రెండేళ్ల బిడ్డతో అడవుల్లోకి వెళ్లి.. భర్తను విడిపించుకు వచ్చింది. ఇప్పుడు సోనాలి కూడా ఇదే దారిలో భర్తను మావోల చెర నుంచి విడిపించుకువచ్చింది.