గాల్లోకి ఎగిరి , ఇవతల రోడ్డుపై పడి.. లాంగ్ డ్రైవ్ ఘోరం..

  0
  505

  లాంగ్ డ్రైవ్ పేరుతొ యువత చేసే డ్రైవింగ్ యెంత ప్రాణాంతకమో బెంగుళూరు సమీపంలో గతరాత్రి జరిగిన ప్రమాదం నిదర్శనం.. ఈ ప్రమాదంలో చనిపోయిన నలుగురు విద్యార్థులు తెలుగువారే.. గాయపడ్డ మరో ఇద్దరు కూడా తెలుగువారే.. వారి పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది.

  బెంగుళూరు కృష్ణరాజపురం గార్డెన్ సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు , వెంకటేష్ , సురేష్ , భరత్ కుమార్ , వైష్ణవి , కృష్ణశ్రీ , అంకిరెడ్డి , బిబిఎ కోర్స్ చేస్తున్నారు. ఈ ఆరుగురు స్నేహితులు లాంగ్ డ్రైవ్ కోసం మంగళవారం రాత్రి ఒక స్విఫ్ట్ కారులో కోలార్ వైపు బయలుదేరారు.

  హొస్కోట్ పరిధిలో అత్తూర్ గేటువద్ద , రాత్రి రెండు గంటలసమయంలో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి , డివైడర్ ని ఢీకొట్టి , జాతీయరహదారిలో గాల్లోకి ఎగిరి , ఇవతలి వైపు రోడ్డుపై పడింది.. కారుని , ఒక లారీ కూడా ఢీకొట్టింది. తర్వాత పల్టీలు కొడుతూ రోడ్డుకు దిగువకు వచ్చేసింది.

  కారులో మంటలుకూడా వచ్చాయి.. అందరూ 21- 22 ఏళ్ళ మధ్య వయసులో ఉన్నవారే.. ప్రమాదంలో వెంకటేష్ , సురేష్ , భరత్ కుమార్ , వైష్ణవి చనిపోగా , కృష్ణశ్రీ , అంకిరెడ్డి ,చికిత్సపొందుతున్నారు..

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..