మూర్ఛరోగి భర్తను భార్య ఇలా చంపింది..

  0
  1565

  అక్రమ సంబంధాల మోజులో భర్తలను చంపుకున్న భార్యల ఘాతుకంలో ఇది మరో ఘాతుకం. ఆరోగ్యం బాగోలేని భర్తను ఓ భార్య ప్రియుడి సాయంతో దారుణంగా చంపేసి నాటకం ఆడింది. మూడు వారాల తర్వాత ఆమె చేసిన ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో సహా జైలుపాలైంది. బెంగళూరు వర్తూరుకి చెందిన పుష్ప, చంద్రశేఖర్ భార్యా భర్తలు. చంద్రశేఖర్ పనిచేసే ఫ్యాక్టరీలో ప్రమాదం కారణంగా అప్పుడప్పుడు మూర్ఛవ్యాధి వచ్చేది. పుష్ప రెండేళ్ల క్రితం నుంచి మను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి పెద్దలు ఎంత మందలించినా వదులుకునేది కాదు. గత నెల 21వతేదీన తన భర్త బాత్రూమ్ లో పడి చనిపోయాడని చెప్పి అందర్నీ పిలిపించింది. ఆమె మాటలు నమ్మిన బంధువులు, చంద్రశేఖర్ అంత్యక్రియలు పూర్తి చేశారు.

  భర్త నిద్రపోతుండగా రాడ్డుతో తలపై కొట్టి..

  కర్మక్రతువులు అయిన మరుసటిరోజునుంచి పుష్ప, మనుతో కలసి సహజీవనం చేయడం ప్రారంభించింది. అయితే పుష్ప బంధువులు మళ్లీ ఆమెను మందలించడంతో ఆమె సోదరుడి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన కోడల్ని చూసేందుకు అత్త గాయత్రమ్మ పోయింది. ఆ సమయంలో ఆస్పత్రిగదిలోనుంచి పుష్పను ఆమె సోదరుడు విశ్వ, చెల్లెలు గీత మందలించడం విన్నది. మనుతో అక్రమ సంబంధం మానుకోవాలని, వారు ఆమెను హెచ్చరించడం, భర్త చంద్రశేఖర్ ని నువ్వే మను సహాయంతో చంపేశావని మందలించడం కూడా విన్నది. పుష్ప రక్తసంబంధీకులే ఆమెను అనుమానిస్తుండటంతో గాయత్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు మరణానికి కోడలు, ఆమె ప్రియుడు మను కారణం అని అందువల్ల విచారించాలంటూ కోరింది. దీంతో పోలీసులు, వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసింది తానేనని అంగీకరించింది. భర్త నిద్రపోతుండగా రాడ్డుతో తలపై కొట్టి చంపేశామని, ఆ తర్వాత శవాన్ని బాత్రూమ్ లో వేశామని, అతనికి గోడ తగిలి గాయమైందని నమ్మించే ప్రయత్నం చేశామని చెప్పారు. తన ప్రియుడు మను అందుకు సహకరించాడని ఒప్పుకుంది.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??