భర్త హత్య కేసులో భార్యకు జైలు.. సడన్ గా తిరిగొచ్చిన భర్త..

  0
  20491

  చనిపోయిన వ్యక్తులు తిరిగొచ్చారంటూ కొన్ని కథలు ప్రచారంలో ఉంటాయి. అయితే ఇది అలాంటి కథ కాదు, నిజంగా నిజం. చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చాడు. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే.. భర్త చనిపోయిన కేసులో భార్యపై అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఆమె రిమాండ్ ఖైదీగా జైలుకెళ్లింది కూడా. తీరా ఇప్పుడు భర్త బతికే ఉండే సరికి, ఇంటికి తిరిగొచ్చే సరికి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయియ.

  ఇంతకీ ఏం జరిగిందంటే..?
  బీహార్ లోని బెఠియా జిల్లాకు చెందిన రామ్ బహదూర్ కు భార్య దేవి, కుమారుడు ఆకాష్ సింగ్ ఉన్నారు. అతను గుజరాత్ లో బిజినెస్ చేస్తుండేవాడు. ఓసారి తమ్ముడు వికాస్ కుమార్ కి యాక్సిడెంట్ అయిందని తెలిసి బీహార్ కి వచ్చాడు. తమ్ముడిని పలకరించి తిరిగి గుజరాత్ వెళ్లిపోయాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. వాస్తవానికి రామ్ బహదూర్ బీహార్ వెళ్లలేదు.

  యాక్సిడెంట్ నుంచి కోలుకున్న వికాస్ కుమార్, అన్నను చూసేందుకు బెఠియా వెళ్లాడు. అక్కడ తన అన్న భార్య వితంతువుగా కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అన్న మరణంపై వదిన, ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన సమాధానాలు అతడికి నమ్మశక్యంగా తోచలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్ మనోహర్ భార్య, తల్లిదండ్రుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో దాదాపు మూడేళ్లుగా రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. ఎట్టకేలకు హైకోర్టులో వీళ్లకు బెయిల్ దొరికింది. సరిగ్గా అప్పుడే రామ్ బహదూర్ ప్రత్యక్షమయ్యాడు. అంతా షాక్.

  గుజరాత్ కు పనిమీద వెళ్లిన రామ్ బహదూర్.. కొంతకాలం తర్వాత తిరిగి ఇంటికి బయల్దేరాడు. అయితే దారిలో యాక్సిడెంట్ అయింది. అతడి స్నేహితుడు అతడ్ని దగ్గర్లోనే హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. తలకు దెబ్బ తగలడంతో రామ్ బహదూర్ కోమాలోకి వెళ్లిపోయాడు. అదే టైమ్ లో అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేసిన స్నేహితుడు కరోనాతో మరణించాడు.

  కోమా నుంచి బయటకొచ్చిన రామ్ బహదూర్ గతం మరిచిపోయాడు. తన గతం కోసం అతడు చాలా ట్రై చేశాడు. ఎట్టకేలకు వైద్యుల సహకారంతో తన గతానికి చెందిన ఆనవాళ్లకు గుర్తుకుతెచ్చుకోగలిగాడు. కొడుకు పేరు మాత్రం గుర్తొచ్చింది. ఫేస్ బుక్ లో ప్రయత్నిస్తే కొడుకు ఫోన్ నంబర్ దొరికింది. వెంటనే ఫోన్ చేశాడు. నిజంగా అది అతడి కొడుకు ఫోన్ నంబరే. వెంటనే కొడుకు, భార్య వెళ్లి రామ్ బహదూర్ ను ఇంటికి తీసుకొచ్చారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..