గజేంద్రమోక్షం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నీటిలోకి దిగిన ఏనుగును మొసలి పట్టుకోవడం, నీటిలోకి లాక్కెళ్ళాలనుకోవడం, ఏనుగు తిరగబడడం, శక్తి చాలక నీరసించి, విష్ణుమూర్తిని ప్రాధేయపడడం, మహావిష్ణువు చక్రాయుధంతో మొసలి తలను ఖండించడం. ఇది క్లుప్తంగా.
ఘీంకరించే అంత పెద్ద ఏనుగు కూడా నీటిలో ఉన్న మొసలిని ఓడించలేకపోవడానికి కారణం… స్థానబలం. సింహానికి అడవి స్థానబలం అయితే మొసలికి నీరు స్థానబలం. అందుకే ఏనుగు శక్తి చాలలేదు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఏనుగు దెబ్బకి మొసలి అల్లాడిపోయింది. ఆ మొసలిని చీల్చి చెండాడింది.
జాంబియాలో నీటిలో ఓ ఏనుగు పిల్ల నీటి కోసం కొలనులోకి దిగింది. అక్కడే మాటు వేసి ఉన్న మొసలి ఆ గున్న ఏనుగు కాలిని పట్టుకుని ఈడ్చుకెళ్ళేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ ఉన్న తల్లి ఏనుగుకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఆ మొసలిపై దాడి చేయడమే కాక తొండంతో మొసలిని చావగొట్టింది. అంతటితో ఆగకుండా తొండంతో దాన్ని ఒడిసి పట్టుకుని కాళ్ళ కింద వేసి తొక్కేసింది. ఏనుగు దాడితో ఆ మొసలి నీటిలోనే చచ్చింది. బిడ్డ జోలికి వస్తే ఏ తల్లిమాత్రం ఊరుకుంటుంది. ఈ తల్లిఏనుగు కూడా అంతే. ప్రతీకారం తీర్చుకుంది.