హెల్మెట్ ఉన్నా మాస్క్ కూడా పెట్టాల్సిందే

    0
    154

    హెల్మెట్ పెట్టుకున్నాం కదా, మాస్క్ లేకపోయినా పర్వాలేదు అనుకోవద్దు. హెల్మెట్ పెట్టుకున్నా మాస్క్ కూడా పెట్టుకోవాలంటున్నారు హైదరాబాద్ పోలీసులు. మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ రాసేస్తున్నారు.న‌గ‌ర ర‌హ‌దారుల‌పై ప్ర‌మాదాల‌ను, మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్లే రైడ‌ర్‌తో పాటు వెనుకాల కూర్చొనే వారు కూడా తప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌ని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. ఆ ఇద్ద‌రూ హెల్మెట్ ధ‌రించ‌ని యెడ‌ల చ‌లాన్ జారీ చేస్తామ‌న్నారు.అయితే రైడ‌ర్‌తో పాటు వెనుకాల కూర్చున్న వ్య‌క్తి కూడా ప‌లు ప్ర‌మాదాల్లో చ‌నిపోయిన ఘ‌ట‌న‌లు చూశాం. ఈ నేప‌థ్యంలో హెల్మెట్ ధ‌రించాల‌నే నిబంధ‌న‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

    మోటార్ వెహిక‌ల్ యాక్ట్ 1989 ప్ర‌కారం.. హెల్మెట్ ధ‌రించ‌కుండా వాహ‌నం న‌డిపితే రూ. 100 జ‌రిమానా విధిస్తున్నారు. ఇప్పుడు వెనుకాల కూర్చొనే వ్య‌క్తి హెల్మెట్ ధ‌రించ‌క‌పోయిన రూ. 100 జ‌రిమానా విధిస్తూ చ‌లాన్లు జారీ చేస్తామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఇక చాలా మంది వాహ‌న‌దారులు కొవిడ్ సేఫ్టీ నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని పోలీసులు పేర్కొన్నారు. మాస్కులు ధ‌రించ‌కుండా ప్ర‌యాణిస్తున్నారు. త‌ప్ప‌నిసరిగా హెల్మెట్ ధ‌రించాల‌నే నిబంధ‌న‌తో పాటు మాస్కు కూడా ధ‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. సీసీ కెమెరాలు, ఆర్టిఫిషీయ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాస్కు ధ‌రించ‌ని వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. మాస్కు ధ‌రించ‌కుండా బైక్‌ల‌పై ప్ర‌యాణించే వారికి రూ. 1000 జ‌రిమానా విధిస్తామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..