భర్త సెల్ ఫోన్ చూసింది.. పోలీసులకు పట్టిచ్చింది.

  0
  129

  మహిళలు దుస్తులు మార్చుకుంటుంటే, స్నానం చేస్తుంటే రహస్యంగా వీడియోలు, ఫొటోల తీసే అలవాటున్న భర్తను, ఓ భార్య పోలీసులకు పట్టించింది. చెన్నై వాషర్ మెన్ పేటలో ఇది జరిగింది. తన చెల్లెలు ఇంటికొచ్చినప్పుడు బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకుంటుంటే భర్త రహస్యంగా ఫొటోలు తీయడం చూసింది. ఆ తర్వాత భర్త మొబైల్ ఫోన్ చెక్ చేయాలని ప్రయత్నాలు చేసింది. భర్తతో బాగా ఉన్నట్టే నటించి ఫోన్ అడిగి తీసుకునే ప్రయత్నం చేసింది.

  అయితే భర్త పాస్ వర్డ్ చెప్పలేదు. మరో సందర్భంలో తన చెల్లెలు బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే వెనక కిటికీనుంచి వీడియో తీస్తున్నట్టు అనుమానం వచ్చింది. భర్తను ప్రశ్నించింది. తానేదో పనిమీద ఆవైపు వెళ్లానని చెప్పాడు. అయిత ేభర్త ప్రవర్తనపై అనుమానం వచ్చి నిలదీసింది. ఆ తర్వాత భర్త పాస్ వర్డ్ తీసి ఫోన్ చూస్తున్నప్పుడు ఆ ఫోన్ లాక్కుని పరిశీలించింది. ఫోన్ లో అన్నీ మహిళలు దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు, ఫొటోలే ఉన్నాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి భర్తను అరెస్ట్ చేయించి జైలుకి పంపించింది. తన భర్త ఇలాంటి అలవాట్లు జైలుకు పోనిదే మార్చుకునేలా లేడని, ఆయన మంచికోసమే ఇదంతా చేశానని చెప్పింది.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..