తేడా వస్తే , పెళ్లివద్దని లేచివెళ్లిపోతున్నారు..

  0
  138

  పెళ్లికూతుళ్ళు గతంలో మాదిరిలేరు.. పెళ్లిలోనే తేడా వస్తే , పెళ్లివద్దని లేచివెళ్లిపోతున్నారు.. పెళ్లికొడుకులకు పరీక్షలు పెడుతున్నారు.. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు రోజూ జరుగుతున్నాయి.. తాజాగా ఓ పెళ్లికూతురు , చివరి నిమిషంలో పెళ్లివద్దని చెప్పేసింది. పెళ్ళికి కొద్దీ నిమిషాలముందు , ఇద్దరూ పూలదండలు మార్చుకునే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో పెళ్ళికొడుకు , అమ్మాయి మెడలో పూల దండ చిన్నగా వేయకుండా , విసిరేశాడని పెళ్లికూతురు ఆగ్రహం వ్యక్తం చేసింది.

  పెళ్ళికొడుకు తనతో మర్యాదగా ప్రవర్తించలేదని అందువల్ల పెళ్లివద్దని చెప్పేసింది. బంధువులు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. చివరకు పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. అయినా పెళ్లికూతురు ఒప్పుకోలేదు. తన మెడలో పూలమాల విసురుగా వేసాడని , అందువల్ల పెళ్లి రద్దుచేసుంటానని చెప్పేసింది. పెళ్లికూతురు కోరిక ప్రకారమే పెళ్లి రద్దయి పోయింది.. ఉత్తరప్రదేశ్ లోని ఔరియా జిల్లా నవీన్ బస్తీలో ఈ ఘటన జరిగింది..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..