భర్త భోజనంలో స్లోపాయిజన్ , భార్య అరెస్ట్.

  0
  155

  భర్తకు తెలియకుండా అతడి ఆహారంలో ఆరేళ్లుగా డ్రగ్స్ కలుపుతున్న భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని కొట్టాయం జిల్లా పాల టౌన్ లో ఆషాసురేష్ అనే మహిళను అరెస్ట్ చేసారు. మెంటల్ పేషేంట్లకు వాడే డ్రగ్స్ ని , ఆమె తన భర్తకు భోజనంలో కలిపి ఇస్తోంది. 2006లో ఆషాకు , సురేష్ కి పెళ్లయింది. ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తున్న సురేష్ , డబ్బులు బాగానే సంపాదించాడు. స్వంత ఇల్లుకూడా కట్టుకున్నాడు. అయితే గత నాలుగేళ్లుగా సురేష్ ఆరోగ్యం క్షీణించింది. షాపుకెళ్లినా ఉండలేకపోతున్నాడు. కొద్దిసేపుకూడా కూర్చోలేకపోతున్నాడు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం కలగలేదు. వ్యాధి నయంకాలేదు.

  కొంతమంది డాక్టర్ లు లో షుగర్ వల్ల ఇలాఉందని చెప్పి మందులు వాదించారు,. దీనివల్ల పరిస్థితి తీవ్రమైంది. ఇలా ఎప్పటికప్పుడు జబ్బేమిటో తెలియకుండా , డాక్టర్లు సంబంధంలేని వైద్యంచేసి మందులు ఇచ్చి ఆరోగ్యం మరింతగా పాడుచేశారు. ఒక స్నేహితుడు సలహాపై కొట్టాయం వెళ్లి , అక్కడున్నాడు. మందులన్నీ మానేసాడు. విచిత్రంగా ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు అతడికి భార్యపై అనుమానం వచ్చింది. తన భార్య ఏదో కుట్ర చేస్తోందని భావించి స్నేహితుడు సలహా కోరాడు. అతడి సూచన మేరకు , ఇంటికి తిరిగొచ్చి , మళ్ళీ ఇంటిబొజనం చేసాడు.

  యధాప్రకారం ఆరోగ్యం చెడింది. దీంతో ఇంట్లో రహస్యంగా కెమెరా పెట్టించాడు. షాపుకి భోజనం పంపమని చెప్పాడు. అక్కడ బయటనుంచి భోజనం తెప్పించుకొని తినేవాడు. భార్య తెచ్చిన భోజనాన్ని పోలీసు సాయంతో ల్యాబ్ కి పంపాడు. పోలీసులు సిసి కెమెరా వీడియోలు చూసి , భార్య ఆషా భోజనంలో విషపదార్థం కలుపుతొందని నిర్దారణకు వచ్చారు. ల్యాబ్ రిపోర్ట్ కూడా అలాగే వచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తమ వాళ్లకు డబ్బులు ఇవ్వడంలేదని , ఆస్తి తనపేరుతో రాయలేదని భార్య , అతితెలివితేటలతో స్లో పాయిజన్ లాగా , భోజనంలో మాత్రలు కలిపి , చంపాలని ప్లాన్ చేసిందని అనుమానిస్తున్నారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..