కరిచినా , కాటేసినా , ఊపిరున్నంతవరకు పాములతోనే..

  0
  115

  వావా సురేష్.. అలియాస్ స్నేక్ సురేష్. ఇతని జీవితం పాములకి అంకితం. ఇతని గురించి తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. పూర్తిగా తెలుసుకుంటే ఒక్క క్షణం గండె ఆగినంత పని అవుతుంది. చాలామంది గ్రామాల్లో పాములు పడుతంటారు, ఒడుపుగా వాటిని ఒక దగ్గరకి చేర్చుతంటారు, అడవుల్లో వదిలిపెడుతుంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటివారు చాలామందే ఉంటారు. కానీ వావా సురేష్ మాత్రం చాలా వెరైటీ. కేరళలోని కొట్టాయంకి చెందిన వావా సురేష్ పాములు పట్టడంలో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. చిన్నప్పటినుంచీ అతను పాములు పట్టడంలో నేర్పరి. ఎక్కడ పాము కనపడినా దాన్ని పట్టేసి సమీపంలోని అడవుల్లో వదిలిపెడుతుంటాడు. ఇప్పటి వరకు 270 కింగ్ కోబ్రాలను ఒడుపుగా పట్టాడు. దాదాపు 38వేల ఇతర పాముల్ని పట్టుకున్నాడు.

  అన్నిసార్లు పాములు పడితే అవి ఎప్పుడూ కరవలేదా అని మీకు అనుమానం రావచ్చు. లెక్కలేనన్ని సార్లు పాములు కాటేశాయి. అన్నిసార్లూ అతను తప్పించుకోలేదు, కొన్నిసార్లు యాంటీ వీనమ్ ఇంజెక్షన్లతో బయటపడ్డాడు. మరికొన్నిసార్లు ఆస్పత్రిపాలయ్యాడు. ఇప్పటి వరకు 3 సార్లు వెంటిలేటర్ పై ఉన్నాడు. ఆరుసార్లు ఐసీయూలో చికిత్స తీసుకున్నాడు. 300 సార్లు పాములు కరిచాయని చెబుతాడు సురేష్. 2013, 2015, 2020, చివరిగా ఈ ఏడాది జనవరి 31న పాము కాటుకి గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.

  తాజాగా అతడిని కురిచి గ్రామంలో పాము తొడపై కరిచింది. పాముని పట్టుకుని సంచిలో వేసుకుంటుండగా.. అది తొడపై కరిచి తప్పించుకుని పోయింది. దీంతో అతను అక్కడికక్కడే పడిపోయాడు. 72 యాంటీ వీనమ్ ఇంజక్షన్లు ఇచ్చినా అతనికి నయం కాలేదు. కొట్టాయం ఆస్పత్రినుంచి మరో కార్పొరేటా ఆస్పత్రికి తరలించేందుకు కేరళ మంత్రి ఎస్కార్ట్ గా వచ్చాడంటే అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆమధ్య పాము చేత భార్యను కరిపించి ప్రమాదంగా చిత్రీకరించిన కేసులో.. భర్తను కటకటాల్లోకి నెట్టేందుకు వావా సురేష్ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. రక్తపింజరి ఎలా కరుస్తుంది, దాని విషం ఎలా పనిచేస్తుందనే సమాచారాన్ని కోర్టుకి అందించారు వావా సురేష్.

  2012లో కేరళ అటవీ శాఖ మంత్రి, వావా సురేష్ కి స్నేక్ పార్క్ లో ఉద్యోగం ఇస్తానన్నాడు. నాకు ఉద్యోగం వద్దని చెప్పాడు, ఉద్యోగంలో కుదురుకంటే ఇంకెక్కడికీ వెళ్లలేనని, పాములు పట్టలేనని చెప్పాడు. ఇక బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ భారత్ కు వచ్చినప్పుడు వావా సురేష్ ని ప్రత్యేకంగా కలిశాడు. ఆయన గురించి తెలుసుకుని త్రిశూర్ వచ్చి మరీ వావా సురేష్ తో మాట్లాడి వెళ్లాడు ప్రిన్స్ ఛార్లెస్. అతడి ధైర్యాన్ని మెచ్చుకున్నాడు.

  పాములు పట్టేటప్పుడు కనీసం రక్షణ ఏర్పాట్లు కూడా చేసుకోడ వావా సురేష్. బూట్లు వేసుకోడు, చేతులకు గ్లౌజ్ లు కూడా వేసుకోడు. కనీసం చేతిలో కర్ర కూడా ఉండదు. పాముని ఒడపుగా చేతులతోనే పట్టేసుకుంటాడు. దాన్ని సంచిలో వేసుకుని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాడు. 48ఏళ్ల వావా సురేష్.. పాములపై ఎప్పుడూ కంప్లయింట్ చేయడు. తెలిసో తెలియకో.. వాటికి తాను హాని కలిగించిన సందర్భంలోనే అవి తనను కరిచేవని, తన పొరపాటు వల్లే పాములు కరిచాయి తప్పించి వాటికై అవి దాడి చేయలేదని చెబుతాడు. ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా పాములు పడతానని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు వావా సరేష్. మరణం అంచులవరకు వెళ్లొచ్చినా సరే తగ్గేదే లేదంటన్నాడు. తన తుది శ్వాస వరకు పాములు పడుతూనే ఉంటానని అన్నాడు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..