మజ్లీస్ నేత అసదుద్దీన్ ఒవైసి , తుపాకీ కాల్పులనుంచి క్షేమంగా బయటపడినందుకు , హైదరాబాద్ కే చెందిన ఒక వ్యాపారవేత్త 101 మేకలను బలి ఇచ్చి , విందుచేశారు. హైదరాబాద్ లోని బాగ్ ఇ జహానారా లో జరిగిన ఈ కార్యక్రమానికి మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల కూడా హాజరయ్యారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా , బాగ్ పట్ లో ప్రచార కార్యక్రమం ముగించుకొని అసదుద్దీన్ ఒవైసి , ఢిల్లీకి తిరిగిపోతుండగా , ఆయన కారుపై ఇద్దరు దుండగులు పిస్టల్ తో పేల్చారు. ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని సచిన్ పండిట్ , శుభం గా గుర్తించారు. ఈ దాడి జరిగిన వెంటనే అసదుద్దీన్ ఒవైసికి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించినా ఆయన నిరాకరించారు.