అక్కమొగుడితో అక్రమ సంబంధంతో , భర్తను హత్యచేసేందుకు ఓ నీచురాలు ప్రయత్నం చేసింది. కర్ణాటకలోని యాదగిరిజిల్లా హివినహళ్లిలో చంద్రకళ అనే మహిళ , విశ్వనాధ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఒక బిడ్డకూడా పుట్టాడు. అక్క,, చెల్లెళ్లు అనోన్యంగా ఉండేవాళ్ళు.. చంద్రకళ , తన అక్క భర్త బసవంగౌడతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంది. ఈ విషయం తెలిసి , భర్త విశ్వనాధ్ ఆమెను మందలించాడు. అయినా చంద్రకళ బావతోనే అక్రమసంబంధం కొనసాగించింది. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని , బావతో కుట్ర చేసింది. రాత్రి . దేవుడు ప్రసాదం అంటూ మత్తుమాత్రలు కలిపిన స్వీట్ ఇచ్చింది. ప్రసాదం అని తిన్న విశ్వనాధ్ పడుకొని నిద్రపోయాడు. అర్ధరాత్రి బావని పిలిపించి , గొంతు నులిమి చంపే ప్రయత్నంలో , విశ్వనాధ్ పెనుగులాడి , ఇంట్లోనుంచి పారిపోయాడు. ఇరుగుపొరుగు ఈ విషయాన్నీ పోలీసులకు చెప్పడంతో , పోలీసులు చంద్రకళను , ఆమె బావ బసవంగౌడను అరెస్ట్ చేసి జైలుకు పంపారు..