పారిస్ సంపన్న అమ్మాయి.. భారతీయ పేద అబ్బాయి..

  0
  12588

  కోటేశ్వురాలు పేదవాడికి మనసు ఇవ్వడం , అతడికోసం త్యాగం చేయడం.. ఇలాంటివన్నీ సినిమాలోనో , కధల్లోనో ఉంటాయి.. అయితే ఫ్రాన్స్ దేశానికీ చెందిన , ఓ సంపన్నురాలు , కూటికిలేని బీహారీ యువకుడి ప్రేమలో పడి , ఆరేళ్ళ తరువాత , బీహార్ కే వచ్చి , భారతీయ సంప్రదాయంలోనే పెళ్లిచేసుకుంది. పారిస్ కి చెందిన మారిలోరిహెరాల్ అనే యువతి , భారతదేశంలో పుణ్యక్షేత్రాలు , ప్రాచీన కట్టడాలు చూడాలని ఆరేళ్ళ క్రితం వచ్చింది. అప్పట్లో ఆమెకు , బీహార్లోని బెగుసరాయ్ జిల్లా కఠారియా గ్రామానికి చెందిన రాకేష్ టూరిస్ట్ గైడ్ గా పనిచేశాడు. ఆ విధంగా పరిచయం ఏర్పడింది. చాలామంది విదేశీ టూరిస్టులు దేశం వదిలిపోయిన తరువాత టూరిస్ట్ గైడ్ల సంగతే మర్చిపోతారు. అయితే మారిలోరిహెరాల్ పారిస్ కి వెళ్ళిపోయినా , రాకేష్ తో ఫోన్లో మాట్లాడేది. ఆ విధంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మారిలోరిహెరాల్ , రాకేష్ కి ప్రపోజ్ చేసింది. పారిస్ కి వచ్చేస్తే పెద్ద వ్యాపారం పెట్టిస్తానని చెప్పింది. చెప్పడమేకాదు , అక్కడకు పిలిపించి బిజినెస్ పెట్టించింది. తరువాత , రెండు కుటుంబాలపెద్దలు ఇద్దరికీ పెళ్ళిచేయాలని నిర్ణయించుకున్నారు. మారిలోరిహెరాల్ కోరిక మేరకు , బీహార్ లోనే ఆదివారం ఇద్దరికీ భారతీయ సంప్రదాయంలోనే పెళ్ళిచేసారు..

   

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.