నా డైట్ ఇదే.. నేనింతే .పచ్చిమాంసమే సూపర్.

  0
  278

  ఇటీవ‌లకాలంలో సోష‌ల్ మీడియాలో డైటీషియ‌న్ల పేరుతో చ‌దువు రాని వాళ్ళు కూడా స‌ల‌హాలు ఇవ్వ‌డం ఎక్కువైపోయింది. డైటీషియ‌న్లు, బ్యూటీషియ‌న్ల‌కు ఎలాంటి క్వాలిఫికేష‌న్ లేక‌పోవ‌డంతో అడ్డ‌గోలు సంపాద‌న‌కు సోష‌ల్ మీడియాను వాడుకుంటారు. ఏది తినాలో ఏది తిన‌కూడ‌దో కూడా చెప్పేస్తుంటారు. అయితే ఇవేవీ నిజం కాద‌న్న‌ట్లు ఓ వ్య‌క్తి ఆహార‌పు అల‌వాట్లు చూస్తే ఆశ్చ‌ర్యం వేస్తుంది. 39 ఏళ్ళ వెస్టన్ రో అనే వ్య‌క్తి గ‌త మూడేళ్ళుగా ప‌చ్చి మాంస‌మే తింటున్నాడు. ఉడ‌క పెట్టిన‌ది తిన్న‌ప్ప‌టి కంటే ఇప్పుడు ప‌చ్చి మాసం తినేట‌ప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నానంటూ చెబుడుత‌న్నాడు. శారీర‌కంగా చాలా బ‌లంగా త‌యార‌య్యాన‌ని చెప్పాడు.

  ఉడ‌క పెట్ట‌కుండానే బీఫ్‌, లివ‌ర్, చికెన్ తినేస్తున్న‌ట్లు తెలిపాడు. ఇత‌డి ఆహార‌పు అల‌వాట్లు చూసిన డాక్ట‌ర్లు.. ఆరోగ్య ప‌రంగా చాలా బాగున్నాడ‌ని నిర్ధారించారు. ప్యాకేజీ ఫుడ్ వాడ‌డు. స్నాక్స్ అస‌లే తీసుకోడు. రోజుకు రెండు ద‌ఫాలు ప‌చ్చి మాంస‌మే తింటాడు. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ గా నాలుగు గుడ్లు, ఒక పండు మాత్ర‌మే తీసుకుంటాడు. చాలామంది డైటీషియ‌న్లు ఒక‌రు చెప్పింది ఒక‌రు చెప్ప‌ర‌ని… చివ‌రికి త‌న‌కు అర్ధ‌మైంది ఏమిటంటే, వాళ్ళ‌కి ఏమీ తెలియ‌ద‌ని పేర్కొన్నాడు.

  దీంతో త‌న ఆరోగ్యం కోసం తానే డైటింగ్ సిస్ట‌మ్ మార్చుకున్నాడ‌ని చెప్పాడు. ఒకే ఒక వండిన ప‌దార్ధం రోజు మార్చి రోజు తింటాన‌ని, అది బంగాళ‌దుంప అని చెప్పాడు. ప్ర‌తిరోజూ రెండు స్పూన్ల తేనె తాగుతుంటాడు. పాలు, వెన్న తీసుకుంటాడు. ఇది అత‌ని స‌రికొత్త డైటింగ్ సిస్ట‌మ్‌. నెబ్రాస్కాకు చెందిన వాడు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..