లుడో గేమ్ లో మైనర్ల లవ్ ..ఇల్లు వదిలి ..

  0
  643

  ఫోస్ బుక్ ప‌రిచ‌యాలు… టిక్ టాక్ ప‌రిచ‌యాలు… ఇప్పుడు వీడియో గేమ్స్ ప‌రిచ‌యాలు… ఏదైతేనేం చివ‌రికి ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు మోసం పోవ‌డం ఖాయం. ఇటీవ‌ల లూడో గేమ్ బాగా ట్రెండింగ్ అయింది. ఆ గేమ్ ద్వారా ప‌రిచ‌య‌మైన అబ్బాయి కోసం ఓ అమ్మాయి ఏకంగా సొంత ఊరి నుంచి ప‌క్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. వివ‌రాల్లోకి వెళితే.. ఒరిస్సాకు చెందిన 14 ఏళ్ళ అమ్మాయికి లూడో గేమ్ ద్వారా హ‌ర్యానాలోని పానిప‌ట్ కి చెందిన అబ్బాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌కు దారి తీసింది. ఒక‌రోజు ఉన్న‌ప‌ళంగా ఆ అమ్మాయి త‌న ఇంటి నుంచి పానిప‌ట్ లో ఉన్న అబ్బాయి ఇంటికి వ‌చ్చేసింది. పెళ్ళి చేసుకోవాల‌ని కోరింది. ఆ అమ్మాయికి 14 ఏళ్ళు అయితే అబ్బాయికి 13 ఏళ్ళే. అయిన‌ప్ప‌టికీ అమ్మాయి న‌చ్చ‌డంతో అబ్బాయి త‌ర‌పు వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్న విష‌యం తెలిసి… అందులోనూ ఆ అమ్మాయి గురించి తెలిసాక‌.. స్థానికులు వెంట‌నే ఆ అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. దీంతో అమ్మాయి కుటుంబీకులు అక్క‌డికి వ‌చ్చి.. కూతురుని ఇంటికి తీసుకెళ్ళారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..