హాసనాంబా.. ఇదేమి కోర్కెల చిట్టా తల్లీ..

  0
  2053

  నాకు ప్రేమించిన వాడితో పెళ్లికావాలి దేవుడా,
  ఈ దఫా ఎన్నికల్లో మా ఎమ్మెల్యే ఓడిపోవాలి తల్లీ..
  మా బాయికి ప్లస్ ఒన్ లో 90 శాతం మార్కులు రావాలి..
  నా భర్త తాగుడు మానెయ్యాలి..
  మా ఇంటిముందు రోడ్డులో గుంత పూడ్చేయ్యాలి..
  నా భార్య మొబైల్లో చాటింగ్ మానేట్టు చూడు తల్లీ..
  నా భార్య మైండ్ లో వేరే ఒకడు ఉన్నట్టు డౌట్ ఉంది.. అది నిజంకాకుండా చూడు తల్లీ..
  నా ప్రేమ విషయం నా భార్యకుగానీ , నా లవర్ భర్తకు గానీ ఎప్పటికీ తెలియకుండా చూడు తల్లీ.. అంటూ ఇలాంటి స్లిప్పులు ఒకటా రెండా.. వందల్లో తమ కోరికలన్నీ రాసి , భక్తులు హుండీలో వేశారు.. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుందో తెలుసా..? అదొక పురాతనమైన ఆలయం.. ఆలయం పేరు హాసనంబ దేవాలయం. కర్ణాటకలోని హాసన్ లో ఉంది. ఏడాదిలో ఈ ఆలయం 9 రోజులు మాత్రమే తెరిచిఉంచుతారు.. మిగిలిన రోజుల్లో మూసేస్తారు.. ఆలయం గతనెల 28 న తీసి , ఈ నెల 6 తేదీ మూసేస్తారు.. ఈ తొమ్మిది రోజుల్లో , భక్తులు దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని , ఇలా తమ కోర్కెల చిట్టాలను హుండీలో వేస్తారు.. డబ్బులకోసం హుండీ తీస్తే , ఇలా చిత్రవిచిత్రమైన కోర్కెలతో హుండీలో ఈ స్లిప్పులు వేశారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..