అరగంటకు కారు పార్కింగ్ ఫీజు 500 రూపాయలు..

  0
  4312

  సికింద్రాబాద్ లో ఓ వ్యక్తి, తనకు తెలిసిన వారు ఊరెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇద్దామని కారులో వచ్చాడు. పార్కింగ్ లాట్ లో కారును పార్క్ చేసి.. స్టేషన్ లోపలి వెళ్ళాడు. ఓ అరగంట తర్వాత వచ్చి కారును తీసుకున్నాడు. అయితే పార్కింగ్ సిబ్బంది వేసిన బిల్లు చూసి.. అతడికి నోట మాట రాలేదు. ఏకంగా 500 పార్కింగ్ బిల్లు వేయడంతో అతడు బిత్తరపోయాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. అదంతేనంటూ సమాదానం వచ్చింది.

  పార్కింగ్ ఫీజు 423 కాగా.. సీజీఎస్టీ 38.. జీఎస్టీ 38 కూడా వేయడంతో అతడికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. దీంతో సైలెంట్ గా బిల్లు కట్టేసి.. తన బాధను సోషల్ మీడియాలో మిత్రులతో పంచుకున్నాడు. ఇకపై కారు వేసుకొని రైల్వే స్టేషన్ కు వెళ్లనని చెప్పుకున్నాడు. ఇది చంద్రమండలలో పార్కింగ్ ధరలా.. లేక సికింద్రాబాద్ లో పార్కింగ్ ధరలో తనకు అర్ధం కావడం లేదని వాపోయాడు. ఇకపై మీరు కూడా కారులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తే కాస్త జాగ్రత్త..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..