పునీత్ పుణ్యకార్యాల్లో ఒకటి నేను పూర్తిచేస్తా.. విశాల్.

  0
  1156

  పదిపైసలు దానం చేసి , వందరూపాయలు ప్రచారం చేసుకునే నేటి పరిస్థితిల్లో , కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిశ్శబ్దంగా చేసిన మహోన్నత సేవాకార్యక్రమాలు ఇప్పుడు జన నీరాజనాలు అందుకుంటున్నాయి.. అయన చేపట్టిన , సేవా యజ్ఞాలలో ఒకటైన పేదపిల్లల చదువుల కార్యక్రమాన్ని తాను కొనసాగిస్తానని తమిళ హీరో విశాల్ ప్రకటించారు. ఒక వ్యక్తి , మహా శక్తిగా మారి ఇంత సేవ చేయడం గొప్ప విషయమని విశాల్ చెప్పారు. తన స్నేహితుడు పునీత్ , చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ఒకటైన , 188 మందికి చదువు చెప్పించే కార్యక్రమాన్ని తాను పూర్తిచేస్తానన్నారు . స్వర్గంలో ఉన్న తన స్నేహితుడికి ఇలా కృతజ్ఞత చెప్పుకుంటానని అన్నారు. ఎనిమి సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా , పునీత్ చిత్రపటానికి నివాళులు అర్పించి ఈ విషయం ప్రకటించారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..