రెండురోజులపాటు భారీ వర్షాలు..

    0
    562

    రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. బంగాళాఖాతంలో నైరుతి దిశగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు , కేరళ , పుదుచ్చేరి రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, శ్రీలంక తీరాల వద్ద సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో ప్రకాశం జిల్లా నిడమానూరు లో 27 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు వర్షాలు సూచనతో , దీపావళి కోసం టపాకాయలు నిలువ చేసుకున్న వ్యాపారుల్లో గుబులు రేగింది.. మరో రెండూ రోజులపాటు ఇదే విధమైన వాతావరణం కొనసాగనుంది.. తరువాత ఈ నెల 15 తరువాత మరో అల్పపీడన ప్రభావం తుఫానుగా మారే అవకాశంకూడా ఉంది..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..