మాధవి టీచర్ ఆన్ లైన్ క్లాసులో అలా ఎందుకు ?

    0
    90107

    కొంతమందికి మృత్యువు రాక తెలుస్తుందా.. ?? క్షణాల్లో తమకు మరణం తప్పదని తెలుస్తుందా ..?? అది నిజమోకాదో తెలియదుగానీ , తొమ్మిదో క్లాస్ ఆన్లైన్ క్లాసులో మాధవి అనే టీచర్ చెప్పిన మాటలతో , విద్యార్థులు కలత చెందారు.. ఒక రోజుగడిచినా ఏడుస్తూనే ఉన్నారు.. పిల్లలే కాదు , వాళ్ళ తల్లితండ్రులుకూడా కన్నీరుపెట్టుకుంటున్నారు. కేరళలోని కేసర్ ఘడ్ లో మాధవి అనే 47 ఏళ్ళ మ్యాథ్స్ టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పేసింది.. లెస్సన్ చెబుతున్నంతసేపు ఆయాసంతోనే ఉండింది. అయినా క్లాస్ ఆపలేదు. తరువాత హోమ్ వర్క్ ఇచ్చింది.. అప్పుడు చివరగా ఆమె చెప్పిన మాటలే కన్నీరు తెప్పిస్తున్నాయి.. పిల్లలూ , అందరూ కెమెరాలు ఆన్ చేయండి.. మీ ముఖాలు నాకు బాగా కనపడాలి .. అంటూ అందరినీ చూసింది.. రేపు నేను ఉంటానో ఉందనో , హోమ్ వర్క్ మాత్రం చేయండి.. బాగా చదువుకొని పైకి రండి.. నేను ఎక్కడున్నా నా బ్లెస్సింగ్స్ .. అంటూ పడిపోయింది.. అంతే ప్రాణం విడిచేసింది.. హాస్పిటల్ కి తీసుకుపోయినా చనిపోయిందనే చెప్పారు.. స్కూల్ అధికారులు ఇప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసి పెద్దగా ఏడ్చేసారు.. పిల్లలకు చదువుచెబుతూనే , తనకెంతో ఇష్టమైన స్టూడెంట్స్ ని చూస్తూనే , వాళ్లకు ఆశీసులు ఇస్త్తూ , ప్రాణాలు వదిలిన ఆ టీచర్ ఎంత మహనీయురాలో.. ??

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..