ప్రభాస్ కొత్తకారులో షికారుకెళ్లింది ఎవరో తెలుసా..?

  0
  921

  కొత్త కారు కొన్న ప్రభాస్, దానిలో ముందుగా షికారుకెళ్లే అవకాశాన్ని తనకు అత్యంత ఇష్టమైన అమ్మాయికి ఇచ్చారు. ఆమె ఎవరో కాదు, ప్రభాస్ సోదరి ప్రసీద. కృష్ణంరాజు-శ్యామల కుమార్తె అయిన ప్రసీద.. ప్రభాస్ కొత్త కారులో షికారుకి వెళ్లారు. లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్ స్టర్ అనే ఈ లగ్జరీ కారుని ఇటీవలే బెంగళూరు నుంచి తన ఇంటికి తెప్పించారు ప్రభాస్. దీని విలువ రూ.7 కోట్లు ఉంటుంది. నారింజ రంగులో ఉన్న ఈ కారులో మొదటగా ప్రసీద షికారు చేశారు. ఈ లంబోర్గిని కారు హైదరాబాద్‌ రోడ్ల మీద చక్కర్లు కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రసీద కారులో ఉన్న వీడియోలను ఆమె తల్లి శ్యామల సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. దీంతో ఈ వీడియోలు మరింత వైరల్ గా మారాయి. అయితే చెల్లెలితోపాటు, ప్రభాస్ కూడా కారులో ఉన్నాడా లేదా అనేది మాత్రం తెలియలేదు.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ