వసంత పంచమి అంటే ఏంటి..? ఆ రోజు ఏం చేయాలి..?

    0
    229

    వసంత పంచమి రోజు సరస్వతి దేవిని పూజిస్తారు. చదువుల తల్లి పుట్టినరోజు కావడం వల్లే వసంత పంచమి రోజున ఆమెను ఆరాధిస్తారు. జ్ఞాన సముపార్జనకి అది ఆది మహూర్తంగా భావిస్తారు. ఙ్ఞానానికి, సర్వ కళలకు అధి దేవత అయిన సరస్వతీదేవి మాఘ శుద్ధ పంచమినాడు జన్మించినట్లుగా చెబుతారు. మాఘమాసం శిశి రుతువులో వచ్చినా.. వసంతరుతువుకి స్వాగతం అప్పటినుంచే ప్రారంభమవుతుంది. అదే రోజును శ్రీపంచమిగాను, మదన పంచమిగాను, వసంతపంచమిగాను కూడా జరుపుకోవడం ఆనవాయితీ.

    వసంతపంచమి రోజున వయోభేదం లేకుండా అందరూ సరస్వతీ దేవిని పూజిస్తారు. ముఖ్యంగా బడికి వెళ్లే వయసున్న పిల్లలతో సరస్వతి పూజ చేయిస్తారు. దీని ద్వారా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు అలవడతాయని నమ్మకం.

    అక్షరాభ్యాసానికి అనువైన రోజు..

    చిన్న పిల్లల అక్షరాభ్యాసానికి వసంత పంచమి అనుకూల మైన రోజు అని అంటారు. అందుకే ఈరోజు ఊరూవాడా సరస్వతి ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు తల్లిదండ్రులు. తోటి పిల్లలకు పలకలు, పెన్సిళ్ళు, నోట్ బుక్స్ పంచిపెడతారు. ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి కరుణించి చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని చెబుతారు.

    సరస్వతికి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.

    అదిలాబాద్‌ జిల్లాలోని బాసరలో ఙ్ఞానసరస్వతీ ఆలయం, కాశ్మీరులోని శారదాదేవి ఆలయం, నల్గొండ జిల్లాలోని అడ్లూరి గ్రామంలోని సరస్వతీ ఆలయం, కర్ణాటకలోని శృంగేరిలో శ్రీ శంకరాచార్య ప్రతిష్టిత శారదా దేవీ ఆలయం మొదలైనవి దక్షిణాదిన ప్రధానమైన సరస్వతి దేవి ఆలయాలు.

    మదన పంచమి కూడా..

    వసంత పంచమిని మదన పంచమిగా కూడా ఆచరిస్తారు. ఈరోజు రతీ మన్మధులను పూజిస్తారు. దీనివలన దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయని నమ్మకం. ఇక దేవీనవరాత్రులలో దుర్గామాత, సరస్వతీ అలంకారంలో దర్శనమిస్తుంది. సరస్వతీదేవికి శారదాదేవి, హంసవాహిని, బుద్ధిధాత్రి, వరదాయని, కౌమారి మొదలగు పేర్లున్నాయి.

    ఇవీ చదవండి:

    ఆమె చెప్పిన అబద్దం హైదరాబాద్ ని గడగడ లాడించింది..

    పతివ్రత వేషాలు – పతిత చేష్టలు.. నటి వశిష్ట అరెస్ట్..

    వైభ‌వంగా వ‌సంత పంచ‌మి వేడుక‌లు