అరవోళ్లు ఏదొచ్చినా ఆపుకోలేరు..

  0
  389

  అరవోళ్ల అభిమానం మామూలుగా ఉండదు. హీరోలు, హీరోయిన్లను ఆరాధ్య దైవాలుగా కొలుస్తుంటారు. అందులోనూ.. కాస్త బొద్దుగా, ముద్దుగా.. ఉండే భామలంటే వారికి విపరీతమైన అభిమానం. ఆమధ్య ఖుష్బూకి, ఆ తర్వాత నమితకి.. ఇప్పుడు నిధి అగర్వాల్ కి గుడి కట్టేశారు. కాస్త నాజూగ్గానే ఉన్నా.. నిధి విషయంలో మాత్రం తమ అభిమానాన్ని ఆపులోకేలపోయారు, విగ్రహం చేయించి హారతి ఇచ్చారు.

  సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నిధి అగర్వాల్ ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం ఈ భామ తమిళ ఇండస్ట్రీ కోలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది.

  https://www.youtube.com/watch?v=C-Cf0ZWdyEE

  అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ నిధి నటిస్తోంది. తాజాగా నిధి అగర్వాల్‌ అభిమానుల నుంచి విలువ కట్టలేని అందమైన బహుమానాన్ని అందుకుంది.

  తమ అభిమాన నటి నిధికి తెలుగు, తమిళ అభిమానులు కలిసి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చెన్నైలో విగ్రహం చేయించి గుడి కట్టారు. అంతేగాక విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేయించారు.

  ఈ విషయాన్ని ట్విటర్‌ లో నిధి ఫ్యాన్స్‌ క్లబ్‌ షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కు తెలంగాణలో విగ్రహం ఏర్పాటు చేసిన విషషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో ఆయన చేసిన సేవలను కీర్తిస్తూ సోనూ అభిమానులు సిద్ధిపేట జిల్లాలోని దుబ్బతండాలో ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ నిధికి తమిళనాడులో విగ్రహాన్ని చేయించి ఏకంగా పాలాభిషేకం చేయడం సంచలనంగా మారింది.

  ఇవీ చదవండి:

  ఆమె చెప్పిన అబద్దం హైదరాబాద్ ని గడగడ లాడించింది..

  పతివ్రత వేషాలు – పతిత చేష్టలు.. నటి వశిష్ట అరెస్ట్..