ఆమె చెప్పిన అబద్దం హైదరాబాద్ ని గడగడ లాడించింది..

    0
    1177

    ఆటో డ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి , అత్యాచారం చేశారని అమ్మాయి చెప్పిన అబద్దం హైదరాబాద్ ని గడగడ లాడించింది.. ఆమె అలాఎందుకు చెప్పిందో చూడండి.. హైద‌రాబాద్ ను గ‌డ‌గ‌డ‌లాడించిన ఫార్మ‌సీ విద్యార్ధిని అత్యాచారం కేసు అస‌త్య‌మ‌ని తేలిపోయింది. త‌న‌ను న‌లుగురు ఆటోడ్రైవ‌ర్లు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశార‌ని ఆమె చెప్పిన మాట‌ల‌తో హైద‌రాబాద్ న‌గ‌రం అట్టుడికిపోయింది.

    దిశ సంఘ‌ట‌న త‌ర్వాత ఇంత ఘోరం జ‌రిగిందా అని భ‌యాందోళ‌న‌కు ప్ర‌జ‌లు గుర‌య్యారు. కాలేజీ నుంచి వ‌చ్చి ఆటోలో ఇంటికి వెళ్ళేందుకు త‌న‌కు తెలిసిన ఆటో ఎక్కాన‌ని, ఆ త‌ర్వాత రెండు స్టాపింగ్ ల‌లో ముగ్గురు ఆటోడ్రైవ‌ర్లు ఎక్కి త‌న ప‌క్క‌న అటుఇటూ కూర్చుని, అర‌వ‌ద్దు అని బెదిరించి… నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారం చేశార‌ని చెప్పింది. ఆమె కిడ్నాప్ కి గురైంద‌న్న స‌మాచారంతో పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి ఘ‌ట్ కేస‌ర్, య‌మ్నంపేట్, అన్నోజీ గూడ త‌దిత‌ర ప్రాంతాల్లో తీవ్రంగా గాలింపు జ‌రిపారు. ఆ త‌ర్వాత బాధితురాలి సెల్ ఫోన్ సంకేతాల ఆధారంగా, ఆమె పంపిన లొకేష‌న్ అనుస‌రించి ఆమెను ఆస్ప‌త్రిలో చేర్చారు.

    https://www.newindianexpress.com/cities/hyderabad/2021/feb/12/bpharm-student-was-gang-raped-2262936.html

    మూడు రోజుల పాటు ఈ ఘ‌ట‌న ఆడ‌పిల్ల‌ల్లోనే కాదు, వారి త‌ల్లిదండ్రుల్లోనూ భ‌యాన్ని రేకెత్తించింది. చివ‌ర‌కు ఇదంతా క‌ట్టుక‌ధ‌గా తేలిపోయింది. ఆటోడ్రైవ‌ర్లు ఆమెపై అత్యాచారం చేయ‌లేద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. సీసీ కెమెరాల ఆధారంగా ఆ యువ‌తి ఎక్క‌డికి వెళ్ళింద‌నేది ప‌రిశీలిస్తే, ఆమె ఒక్క‌టే ఘ‌ట్ కేస‌ర్, య‌మ్నంపేట‌, అన్నోజీగూడ‌ల్లో సంచ‌రించింది. సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఏడు గంట‌ల వ‌ర‌కు అక్క‌డే తిరిగింది. ఆ స‌మ‌యంలో ఆటో డ్రైవ‌ర్ల సెల్ ఫోన్ సంకేతాలు ఆ ప్రాంతాల్లో లేవు. దీంతో ఆ యువ‌తిని పోలీసులు మ‌ళ్ళీ విచారించ‌గా, త‌ను కిడ్నాప్ నాట‌కం ఆడాన‌ని ఒప్పుకుంది. త‌ల్లి ప‌దేప‌దే ఫోన్ చేస్తుండ‌డంతో త‌న‌ను ఆటోడ్రైవ‌ర్లు కిడ్నాప్ చేశాన‌ని చెప్పాన‌ని, తాను ఇంటి నుంచి వెళ్ళిపోవ‌డానికి ఇదంతా చేశాన‌ని చెప్పింది. ఆమెపై అత్యాచారంజ‌ర‌గ‌లేద‌ని కూడా డాక్ట‌ర్లు నిర్ధారించారు

    .

     

    ఇవీ చదవండి:

    ఆమె చెప్పిన అబద్దం హైదరాబాద్ ని గడగడ లాడించింది..

    పతివ్రత వేషాలు – పతిత చేష్టలు.. నటి వశిష్ట అరెస్ట్..