వకీల్ సాబ్ ట్రైలర్ గురించి మూడు వారాలుగా సోషల్ మీడియాలో అదిరిపోయే ప్రచారం జరిగింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కూడా.. బాబాయ్ ట్రైలర్ అదిరిపోతుంది, నేనే ముందు పోస్ట్ చేస్తానని చెప్పి మరింత హైప్ పెంచారు. చివరకు ఈరోజు మహూర్తం చూసి ట్రైలర్ బయటకు వదిలారు. ఇంతకీ ఆ ట్రైలర్ ఎలా ఉంది.
వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ తో అంచనాలు పెరుగుతాయని అనుకున్నారంతా. ఆమధ్య రిలీజ్ చేసిన టీజర్ కి, ట్రైలర్ కి పెద్ద తేడా లేదని కొంతమంది అంటున్నారు. ఇంకొందరయితే ట్రైలర్ సూపర్ అని సర్టిఫికేట్ ఇస్తున్నారు. ట్రైలర్ పై కామెంట్లు ఎలా ఉన్నా.. విడుదలైన గంటకే రికార్డుల మోత మోగించాడు వకీల్ సాబ్.
ట్రైలర్ తోనే రికార్డులు సృష్టించిన వకీల్ సాబ్, సినిమాతో మరిన్ని సంచలనాలు సృష్టిస్తారని అంటున్నారు అభిమానులు. ఈ సినిమాలో పవన్ తో పోటీపడే మరో లాయర్ గా ప్రకాష్ రాజ్ క్రూరత్వానికి చిరునామాగా నిలవబోతున్నారు. ట్రైలర్ లో హీరోయిన్ శృతి కనపడకపోవడం పెద్ద మైనస్.