పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

  0
  3573

  పార్కుల్లో లవర్స్ కానీ, అక్రమ సంబంధాలు ఉన్నవారు కానీ దొరికితే.. వాడికి పండగే. నిద్రలేచింది మొదలు, పార్కుల్లోనే తిరుగుతుంటాడు. పోలీసునంటూ ఫోజులిస్తుంటాడు. పెళ్లయినవారు ఎవరైనా పార్కుల్లో అనుమానాస్పదంగా కనిపించినా, అక్రమ సంబంధం అనే అనుమానం వచ్చినా వాడి పంట పండినట్టే. మురిపాలలో మునిగితేలుతున్న ప్రేమ జంటల దగ్గరకి వెళ్లి, తాను పోలీసునంటూ దబాయిస్తాడు. వారి వివరాలు కనుక్కుంటాడు. పెళ్లై, అక్రమ సంబంధాలు కలిగినవారయితే, వారి భర్తలకు చెప్పేస్తానంటూ, మగవాళ్లయితే భార్యలకు చెప్పేస్తానంటూ బెదిరిస్తాడు. భయపడే ప్రేమికులయితే, వారినీ అదరగొడతాడు. ఫొటోలు తీసుకుంటాడు. తనకు డబ్బులిస్తే వదిలేస్తానని చెబుతాడు.

  ఇలా కొన్ని లక్షల రూపాయలు ప్రేమికుల దగ్గర దోచేశాడు. వాడి టైమ్ బాగోలేక హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఓ జంటను బెదిరించి చిక్కిపోయాడు. వాడి పేరు సృజన్ కుమార్. వారం రోజలు క్రితం నెక్లెస్ రోడ్ లో ఉన్న ఓ జంట దగ్గరకు వెళ్లి బెదిరించాడు. ఇంట్లో వాళ్లని పిలిపిస్తానని చెప్పి అలా చేయకూడదంటే తనకు 2లక్షలు డబ్బులు తెచ్చివ్వాలని డిమాండ్ చేశాడు. ఇద్దరూ పెళ్లికానివారు కావడంతో ఇంట్లో విషయం తెలిస్తే ఇబ్బందులు వస్తాయని డబ్బులిచ్చేందుకు సిద్ధపడ్డారు. అంత డబ్బు లేదని చెబితే, వారి క్రెడిట్ కార్డుల మీద బంగారం షాపులో 2లక్షల విలువ చేసే బంగారం కొన్నాడు. ఆ తర్వాత అతడు పోలీసు కాదని గ్రహించి మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రేమికులు.

  సీసీ టీవీ కెమెరాల్లో ఆ కేటుగాడిని గుర్తు పట్టిన పోలీసులు వాడిని అరెస్ట్ చేసి, బంగారం, మొబైల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీడిమీద హైదరాబాద్ లోనే దాదాపు 12 కేసులు, విశాఖ పట్నంలో మరికొన్ని కేసులు నమోదై ఉన్నాయని, ప్రేమ జంటలను టార్గెట్ చేసుకుని, ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతుంటాడని గుర్తించారు.

  ఇవీ చదవండి

  క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..