గంగాజలమా..? శానిటైజరా..? ఏది బెస్ట్..

  0
  123

  ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ పోలీసులు తమ స్టేషన్ కి వచ్చిన వారందరికీ గంగాజలం బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇకపై శానిటైజర్ల బదులు వీటిని వాడుకోండంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. గంగాజలం పవిత్రమైనదని, శానిటైజర్ల బదులుగా దాన్ని వాడితే సూక్ష్మక్రిములు చనిపోతాయని అంటున్నారు.

  అయితే మీరట్ పోలీసుల ఉచిత ప్రచారం వారికి తిప్పలు తెచ్చిపెట్టింది. గంగాజరానికి ప్రచారం చేస్తే చేశారు కానీ, శానిటైజర్ల బదులు దాన్ని వాడండి అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో బీజేపీ నేతలు అప్పడాలు తింటే కరోనా రాదని చెప్పారు, చివరకు వారే కరోనాబారిన పడ్డారు. ఇప్పటికీ కొంతమంది నేతలు, ఆవుమూత్రం తాగితే.. అన్ని రోగాలు మాయమైపోతాయని చెబుతారు. అలా చెప్పేవారు కూడా అనారోగ్యం వస్తే కార్పొరేట్ ఆస్పత్రులవైపే పరుగులు తీస్తారు.

  ఆమధ్య రామ్ దేవ్ బాబా కూడా కరోనిల్ అనే పేరుతో పతంజలి ప్రోడక్స్ట్ ని విడుదల చేసి విమర్శలపాలయ్యారు. తాజాగా ఇప్పుడు మీరట్ పోలీసులు శానిటైజర్ల బదులు గంగాజలం వాడండి అని చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

  ఇవీ చదవండి

  బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

  పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

  నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..