గాడిదపాలు తాగితే లాభమేంటి? సైన్స్ చెబుతున్నదేంటి?

    0
    170

    గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు.. అన్నాడు వేమన. ఆవు పాలు గరిటెడు ఉన్నా చాలు, గాడిద పాలు కుండనిండా ఉన్నా కూడా ఉపయోగం లేదు అనేది దాని అర్థం. అయితే ఆధుని కాలంలో ఆవు పాలకంటే గాడిదపాలకే ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఇంతకీ గాడిద పాలు ఎందుకు శ్రేష్టం. దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి..?

    ఆవు, మేక, గొర్రె, గేదె, ఒంటె లాంటి పాడి జంతువుల పాలతో పోలిస్తే, గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయని అంటారు. అయితే గాడిద‌ రోజుకు 4 కప్పుల పాలు అంటే దాదాపు 1 లీటరు పాలు ఇస్తుందట. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయని అంటారు.

    గాడిద పాలు.. తల్లిపాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. అందుకనే చిన్నపిల్లలకు వీటిని పట్టిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటారు. గాడిద పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోస్ రూపంలో ఉంటాయి.

    ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు. గాడిద పాలకు ఉన్న యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ లను దూరం చేస్తుందట. అలెర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా గాడిద పాలు ఉపయోగపడతాయి.

    గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని, మృదువైన చర్మం సొంతమవుతుందనే ప్రచారం కూడా ఉంది. గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు షాంపూలు తయారు చేస్తుంటారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..